అభ్యర్థి జైళ్లో.. ఎన్నికల ఫలితాల్లో లీడ్‌లో.. బిహారీలా మజాకా!!

బిహార్‌లో వివాదాస్పదమైన నియోజకవర్గాల్లో ఒకటైన మోకామాలో JDU అభ్యర్థి అనంత కుమార్ సింగ్ (ఛోటే సర్కార్) బలమైన ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. జన్ సురాజ్ పార్టీ మద్దతుదారుడి హత్య కేసులో అరెస్టయిన అనంత్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.

New Update
Anant Kumar Singh

Anant Kumar Singh

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ట్రెండ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో అత్యంత కీలకమైన, వివాదాస్పదమైన నియోజకవర్గాల్లో ఒకటైన మోకామాలో JDU అభ్యర్థి అనంత కుమార్ సింగ్ (ఛోటే సర్కార్) బలమైన ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. జన్ సురాజ్ పార్టీ (జెఎస్పి) మద్దతుదారుడి హత్య కేసులో అరెస్టయిన అనంత్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది రౌండ్ల కౌంటింగ్ పూర్తి అయ్యింది. ఫలితాల్లో దాదాపు 30వేలతో ముందంజలో ఉన్నారు అనంత కుమార్ సింగ్. 11వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జన్ సురాజ్ పార్టీ మద్దతుదారుడి హత్య కేసులో అరెస్టయిన అనంత్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. 

జైలు నుంచే పోటీ చేస్తున్న అనంత సింగ్ తన సమీప ప్రత్యర్థి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అభ్యర్థి వీణా దేవిపై చెప్పుకోదగిన స్థాయిలో లీడ్‌ను కొనసాగిస్తున్నారు. 2020లో ఆర్జేడీ తరఫున గెలిచి, తర్వాత ఒక కేసులో అనర్హత వేటు పడటంతో ఈసారి జేడీయూ తరఫున బరిలోకి దిగిన సింగ్, మోకామాలో తన పట్టు ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు.

చోటా సర్కార్ విడుదలను ఆశిస్తున్న పోస్టర్లు ఆయన నియోజకవర్గంలో కనిపించాయి, " జైల్ కా ఫాతక్ టూటేగా, హమారా షేర్ చూటేగా (జైలు ద్వారాలు విరిగిపోతాయి, మన సింహం విడుదలవుతుంది)" అని రాసి ఉన్నాయి. వేడుకల కోసం ఆయన శిబిరంలో సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి, ఆయన ఇంటి బయట గుడారాలలో భారీ మొత్తంలో స్వీట్లు, ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు