జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. ఆర్మీ జవాను మృతి

జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. కిశ్త్‌వాడ్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రత బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఓ ఆర్మీ జవాను అమరుడయ్యాడు. మరో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.

jawan killed
New Update

జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. కిశ్త్‌వాడ్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రత బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఓ ఆర్మీ జవాను అమరుడయ్యాడు. మరో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల కిశ్త్‌వాడ్‌ జిల్లాలోని ఇద్దరు విలేజ్‌ డిఫెన్స్‌ గార్డ్స్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి హతమార్చారు. ఈ క్రమంలోనే వాళ్లని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన సైనిక బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.    

Also Read: ధరణి స్కామ్.. రూ. 60వేల కోట్ల ప్రభుత్వ భూములు స్వాహా!

కేశ్వాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రత సిబ్బందికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు అక్కడ ఉన్నట్లు పక్కా సమాచారం ఆధారంగా బలగాలు సంయుక్త ఆపరేషన్‌ను చేపట్టాయి. ఇటీవల ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌ను కూడా హతమార్చిన ఉగ్రవాదులు కూడా వీళ్లే. ఇక ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో జేసీవో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది గాయాలపాలయ్యారు. అయితే చికిత్స పొందుతూనే జేసీవో ప్రాణాలు కోల్పోయారు. 

Also read: తెలంగాణ వచ్చి పదేళ్లైన వలసలు కొనసాగుతున్నాయి: సీఎం రేవంత్  

ఈ జేసీవోను ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్‌ ఆఫీసర్ నాయబ్ సుబేదార్ రాకేశ్ కుమార్‌గా గుర్తించారు. విధి నిర్వహణలో వీర మరణం పొంది అమరుడైన రాకేశ్ త్యాగానికి సెల్యూట్ అని సైన్యానికి చెందిన వైట్‌ నైట్‌ ఎక్స్‌ వేదికగా తెలిపింది. మరోవైపు ఈ ప్రాంతంలో ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు భావిస్తున్నామని.. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.   

Also Read: మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో విడుదల.. కీలక అంశాలు ఇవే

ఇదిలాఉండగా ఈ మధ్య జమ్మూకశ్మీర్‌లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. గత ఆదివారం శ్రీనగర్‌లో గ్రెనేడ్‌ పేలుడు జరిగింది. ఈ పేలుడులో 10 మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. అంతకుముందు రోజు కూడా.. ఖన్యార్‌లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి.  

#jammu-kashmir #telugu-news #national-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe