Watch Video: నిలబడి మూత్రం పోస్తున్నారా ? అయితే ప్రమాదంలో పడ్డట్లే..!

వాష్‌రూంలో ఉండే టాయిలెట్లలో మగవారు నిలబడి మూత్రం పోశాక ఫ్లష్ చేస్తారు. దీనివల్ల హానికరమైన క్రిములతో కూడుకున్న యూరిన్ డ్రాప్స్ గాల్లో కలిసిపోయి వాష్‌రూంలో ఉండే టూత్‌బ్రష్, టవల్స్‌, టిష్యూ పేపర్‌లకి వ్యాపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
Toilet

మీరు నిలబడి మూత్రం పోస్తున్నారా ? అయితే మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఇలా చేస్తే హానీకరమైన క్రిములు వల్ల పలు ఇన్‌ఫెక్షన్‌లకు దారితీస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఇది ఎలా జరుగుతుందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. సాధారణంగా మగవాళ్లు వాష్‌రూంలో నిలబడి మూత్రం పోస్తారు. ముఖ్యంగా వెస్టర్న్‌ టాయిలెట్‌లో మూత్రం పోశాక దాన్ని ఫ్లష్ చేస్తారు. ఇలా చేసినప్పుడు దాదాపు 7,550 వరకు చిన్న చిన్న మూత్రం బిందువులు గాలిలో కలిసిపోతాయి. ఆ తర్వాత ఇవి వాష్‌రూంలో ఉండే టూత్‌బ్రష్‌లు, టవల్‌, టిష్యూ పేపర్‌లకు వ్యాపిస్తాయి. కానీ ఇలాంటి చిన్న బిందువులు మన కంటికి కనిపించవు. వాటిలో హానికరమైన క్రిములు ఉంటాయి. 

Also Read: జమిలి ఎన్నికలతో దేశానికి నష్టమా? లాభమా?

ఆ మూత్రం డ్రాప్స్‌ వాష్‌ రూంలో ఉండే టూత్‌బ్రష్‌లు, టవల్‌, టిష్యూ పేపర్‌లకు వ్యాపించడంతో వాటిని వాడే వారు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే మూత్రం పోశాక వెస్టర్న్‌ టాయిలెట్‌ మూతను మూసివేసి ఫ్లష్‌ చేయాలి. ఇలా చేస్తే మూత్రం డ్రాప్స్‌ గాల్లో కలవకుండా నివారించవచ్చు. పలు దేశాల్లో చాలావరకు మగవారు కూర్చోనే మూత్రం పోస్తారు. జర్మనిలో అయితే మగపిల్లలకు చిన్నప్పటి నుంచే కూర్చోని మూత్రం పోయడం నేర్పిస్తారు. మరో విషయం ఏంటంటే.. వాష్‌ రూంలో టూత్‌ బ్రష్‌లు, సబ్బులు, బట్టలు లాంటివి పెట్టుకోకపోవడమే మంచిది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు