Arvind Kejriwal : సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా

మరో రెండు రోజుల తర్వాత తాను సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నానని అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ప్రజలు తీర్పు ఇచ్చే వరకు తాను సీఎం కుర్చీలో కూర్చోనన్నారు. ఎన్నికలు జరిగే వరకు పార్టీకి చెందిన మరొకరు సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తారన్నారు.

author-image
By Nikhil
New Update
Aravind Kejriwal

మరో రెండు రోజుల తర్వాత తాను ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నానని అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) సంచలన ప్రకటన చేశారు. ప్రజలు తీర్పు ఇచ్చే వరకు తాను సీఎం కుర్చీలో కూర్చోనన్నారు. ప్రతీ ఇళ్లు, ప్రతీ వీధికి వెళ్లి ప్రజలను కలుస్తానన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, నిర్దోశినని నమ్మితే తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ రోజు జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వచ్చే ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉందన్నారు. అయితే.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఢిల్లీ ఎన్నికలను సైతం నవంబర్ లో నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read :  హైకోర్టు బిగ్‌ షాక్‌.. హైడ్రా ఆగిపోతుందా ?

Arvind Kejriwal :

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ని ముక్కలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ కుట్రలు పన్నిందన్నారు. తన మనోధైర్యాన్ని కూడా దెబ్బతీయాలని ఆ పార్టీ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయన్నారు. పార్టీలను ముక్కలు చేయడం, ఎమ్మెల్యేలను తీసుకోవడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.. ఇదే బీజేపీ ఫార్ములా అని అన్నారు. తనను జైలుకు పంపించి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావించిందని.. కానీ వారు ఏం చేయలేకపోయారన్నారు.

ప్రతిపక్ష పార్టీల సీఎంలకు ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. అక్రమ కేసులతో జైలుకు పంపిస్తే రాజీనామా చేయవద్దన్నారు. ఎల్లుండి జరిగే పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో కొత్త సీఎం ఎంపిక ఉంటుందన్నారు. ఆ భగవంతుడు ఇచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడతానన్నారు. ఢిల్లీ మద్యం కేసులో మార్చి 11న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. గత వారం ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. అయితే.. సీఎం ఆఫీసుకు వెళ్లొద్దని.. అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయవద్దని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కండిషన్లు పెట్టింది.

Also Read :  చిత్తూరు రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం.. ఎంతంటే ?

Advertisment
తాజా కథనాలు