BPL: బీపీఎల్ గ్రూప్ ఛైర్మన్ టీపీ గోపాలన్ నంబియార్ (94) అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. బెంగళూరులోని ఆయన నివాసం లో ఆయన కన్నుమూశారు. బీజేపీ నేత , కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కు ఆయన బంధువు అవుతారు. దీంతో ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
Also Read: నేటి నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు!
దేశీయ కన్జూమర్ బ్రాండ్ ను నెలకొల్పిన దార్శనికుడు దూరమయ్యారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరలని పేర్కొన్నారు. గోపాలన్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
టెలివిజన్ మార్కెట్ లో బీపీఎల్ పేరు తెలీని వారుండరు. కేవలం టీవీలే కాకుండా...ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు తయారు చేసే సంస్థగానూ గుర్తింపు తెచ్చుకుంది. దీన్ని నంబియార 1963లో నెలకొల్పారు. ఓ కంపెనీని స్థాపించడానికి అనుమతులు పొందడమే చాలా కష్టంగా ఉన్న లైసెన్స్ రాజ్ రోజుల్లో ఆయన ఈ సంస్థను స్థాపించడం విశేషమే. తొలుత కేరళలోని పాలక్కడ్ లో బీపీఎల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు...తరువాత దానిని బెంగళూరుకు మార్చారు.
Also Read: అమెరికా ఎన్నికలకు ముందే అణుబాంబు దాడి.. ఇరాన్ బిగ్ ప్లాన్!
తొలినాళ్లలో రక్షణ దళాలకు సీల్డ్ ప్రెసిషన్ ప్యానెల్ మీటర్లను తయారు చేసిన ఈ సంస్థ ...తర్వాతి కాలంలో కలర్ టీవీలు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్లు, వీడియో క్యాసెట్లు తదితర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేయడం మొదలు పెట్టింది.
90 ల్లో ఎలక్ట్రానిక్ రంగంలో బీపీఎల్ దే హవా. అలాంటిది అంతర్జాతీయ బ్రాండ్లయిన సామ్ సంగ్, ఎల్జీ ప్రవేశంతో తన వైభవాన్ని కోల్పోయింది.
ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం...
బీపీఎల్ గ్రూప్ ఛైర్మన్ టీపీ గోపాలన్ నంబియార్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపాన్ని తెలియజేశారు. భారతీయ ఎలక్ట్రానిక్స్‌కు మార్గదర్శకుడైన నంబియార్‌కు కోల్పోవడం చాలా బాధగా ఉందన్నారు. తన అద్భుత నాయకత్వంతో బీపీఎల్‌ను అందరి ప్రియమైన బ్రాండ్‌గా మార్చినట్లు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అందించిన ఆయన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని చంద్రబాబు ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
Also Read: ఆ ఊరిలో దీపావళి వేడుకలు లేవు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే
‘బీపీఎల్ గ్రూప్ ఛైర్మన్, భారతీయ ఎలక్ట్రానిక్స్‌కు మార్గదర్శకుడైన టీపీ గోపాలన్ నంబియార్‌ను కోల్పయినందుకు చాలా బాధగా ఉంది. తన దూరదృష్టితో కూడిన నాయకత్వంతో బీపీఎల్‌ను ప్రియమైన బ్రాండ్‌గా మార్చారు. భారతీయ గృహాలకు నాణ్యమైన సాంకేతికతను తీసుకువచ్చారు. భారతదేశ పరిశ్రమలలో, ఆర్ధిక వ్యవస్ధలో నంబియార్ పాత్ర ఎన్నటికీ మరువలేనిది. నంబియార్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా’ అంటూ చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు.