Nidhi Tewari : ప్రధాని మోదీకి ప్రైవేట్‌ సెక్రటరీగా నిధి తివారీ!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా ఐఎఫ్‌ఎస్‌ అధికారి నిధి తివారీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014బ్యాచ్‌కు చెందిన ఆమె గతంలో వారణాసిలో అసిస్టెంట్‌ కమిషనర్‌(వాణిజ్య పన్నులు)గా పనిచేశారు.

New Update
modi-ps

modi-ps

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా ఐఎఫ్‌ఎస్‌ అధికారి నిధి తివారీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014బ్యాచ్‌కు చెందిన ఆమె గతంలో వారణాసిలో అసిస్టెంట్‌ కమిషనర్‌(వాణిజ్య పన్నులు)గా పనిచేశారు.  నిధి తివారీ నవంబర్ 2022 నుండి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు.

Also read :  Riyan Parag : గెలిచిన సంతోషమే లేకుండా పోయింది.. రియాన్ పరాగ్కు బిగ్ షాక్!

2014 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారిణి

నిధి తివారీ 2014 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారిణి. ఇప్పటివరకు ఆమె తన కెరీర్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖలోని అనేక ముఖ్యమైన విభాగాలలో పనిచేశారు. పరిపాలనా సామర్థ్యం దృష్ట్యా ఆమెకు ప్రధానమంత్రి ప్రైవేట్ కార్యదర్శి పదవికి పదోన్నతి కల్పించారు. వ్యక్తిగత కార్యదర్శిగా నిధి తివారీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోజువారీ పరిపాలనా పనిని నిర్వహిస్తారు. కాగా ప్రధానమంత్రికి ఇద్దరు ప్రైవేట్ కార్యదర్శులు ఉన్నారు అందులో - వివేక్ కుమార్, హార్దిక్ సతీశ్చంద్ర షా కాగా.. తాజాగా ఇప్పుడు మూడో ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియమితులయ్యారు.

Also read :  UP Crime: అలహాబాద్‌ ఐఐఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య!

Also read : Ap News: విద్యుత్ స్తంభం పైకి దూసుకెళ్లిన కారు.. మద్యం మత్తులో డ్రైవర్ వీరంగం!

నిధి తివారీ 2013లో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యారు. ఇందులో ఆమె ర్యాంక్ 96. ఆమె వారణాసిలోని మహమూర్‌గంజ్‌కు చెందినది. UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ముందు ఆమె వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (కమర్షియల్ టాక్స్)గా పనిచేశారు. ఈ ఉద్యోగంలో పనిచేస్తూనే ఆమెUPSC కి ప్రిపేర్ అయ్యారు.  

Also Read :  Betting App: బెట్టింగ్ యాప్స్‌పై సిట్‌ ఏర్పాటు.. డీజీపీ కీలక ఆదేశం

Advertisment
తాజా కథనాలు