Delhi: దీపావళి పండుగ ఢిల్లీ ప్రజలను ఇబ్బందుల్లో పడేసింది. దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచాపై నిషేదం ఉంది. అయినా కొందరు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయకుండా టపాసులు కాల్చేశారు. దీంతో ఇప్పటికే కనిష్ట స్థాయిలో ఉన్న గాలి నాణ్యత మరింత క్షిణించింది. దీంతో ప్రజలు గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం రాజధానిలో గాలి నాణ్యత 394 వద్దకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు కాలుష్యాన్ని తగ్గించడానికి, అక్బర్ రోడ్ ప్రాంతం సమీపంలో యాంటీ స్మోగ్ గన్ల ద్వారా నీటిని చల్లుతున్నారు.
ఇది కూడా చదవండి: నేటి నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు!
అన్ని రాష్ట్రాల్లో కూడా...
దీపావళి రోజు దేశ ప్రజలు దుమ్ము లేపడమే కాదు.. పొగ కూడా గట్టిగానే లేపారు అనే చెప్పాలి. ఒక్క రాత్రి కాల్చిన టపాసుల కారణంగా గ్రీన్ జోన్ లో ఉన్న రాష్ట్రాలు కూడా ఎల్లో జోన్ లోకి వచ్చాయి. గాలి నాణ్యతలో టాప్ లో ఉన్న రాష్ట్రాలు కూడా ఒక రాత్రికే కనిష్ట స్థాయికి పడిపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే ఢిల్లీ మాత్రం అన్ని రాష్ట్రాలను బీట్ చేసి ప్రతి ఏడాది లాగే గాలి నాణ్యత తగ్గడంతో మొదటి ర్యాంకును సాధించింది. ముంబై, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు రెండు స్థానం కోసం పోటీ పడుతున్నాయి. కాగా ఢిల్లీలో మాత్రం జనవరి వరకు టపాసులపై నిషేధం కొనసాగుతోందని అక్కడి అధికారులు తెలిపారు.
Also Read: అనారోగ్యంతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత!
ఇది కూడా చదవండి: ఆ ఊరిలో దీపావళి వేడుకలు లేవు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే