Air India: ప్రస్తుతం దేశంలో విమానయాన రంగం కుదుపులకు లోనవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏకైక ఫుల్ సర్వీస్ క్యారియర్ గా ఎయిరిండియా మాత్రమే నిలిచింది. 2007లో ఐదు ఎఫ్‌ఎస్‌సీలు ఉండేవి. విలీనాలు, వైఫల్యాల వల్ల వీటి సంఖ్య ప్రస్తుతం ఒకటికి చేరుకుంది. ఫుల్ సర్వీస్ క్యారియర్స్ ప్రయాణికులకు కల్పించే అదనపు సదుపాయాలకు కూడా ఛార్జీలను టికెట్ ధరలోనే కలిపి ఉంటాయి.
Also Read: TGఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికలో గందరగోళం...విధుల నుంచి మరో యువతి తొలగింపు!
అదే లో-కాస్ట్ క్యారియర్స్ టికెట్ ధరను తక్కువగా చూపించి, అదనపు సదుపాయాలకు ఎక్కువగా ధరలను వసూలు చేస్తాయి. విస్తారా ఎయిర్‌లైన్స్ సోమవారం ఎయిరిండియాలో విలీనం అయిపోయింది. దీంతో ఎయిరిండియా మాత్రమే మన దేశంలో ఎఫ్‌ఎస్‌సీగా ఉంది.
Also Read: Srisailam: శ్రీశైలం ఆలయంలో డ్రోన్ కలకలం..అదుపులో ఇద్దరు వ్యక్తులు
ఒక్కొక్కటిగా కనుమరుగు..
2012లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మన దేశంలోని విమానయాన సంస్థల్లో 49 శాతం వాటాలను కొనడానికి విదేశీ ఎయిర్‌లైన్స్ సంస్థలకు అనుమతి ఇచ్చింది. గల్ఫ్ విమానయాన సంస్థ ఎతిహాద్ నుంచి 24 శాతం వాటాను ప్రస్తుతం మూతపడిన జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఎయిర్ ఏసియా, విస్తారా సంస్థలు ప్రారంభమయ్యాయి.
Also Read: పెళ్లింట విషాదం నింపిన ప్రమాదం..వధువు అన్న,స్నేహితురాలి దుర్మరణం
గత పదేళ్లలో ఎఫ్‌ఎస్‌సీగా కార్యకలాపాలను ప్రారంభించిన ఏకైక విమానయాన సంస్థ విస్తారా. ఫుల్ సర్వీస్ క్యారియర్ అయిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ 2007లో ఎయిరిండియాలో విలీనమైంది.
Also Read: Alert: హైదరాబాద్ వాసులు బి అలెర్ట్...ఈ ఏరియాల్లో వాటర్ బంద్!
అప్పటి నుంచి కనీసం ఐదు ఎఫ్‌ఎస్‌సీలు మన దేశంలో ఉండేవి. కింగ్‌ఫిషర్ 2012లోనూ, ఎయిర్ సహారా 2019లోనూ తెరమరుగైపోయాయి. ఎఫ్‌ఎస్‌సీ అయిన జెట్ ఎయిర్‌వేస్ 25 ఏళ్లపాటు నడిచింది. ఆర్థిక ఒడుదొడుకుల కారణంగా 2019లో కుప్పకూలింది. దీనిని ప్రస్తుతం లిక్విడేషన్‌కు పెట్టారు. ఈ నెల 12 నుంచి ఇక ఎయిరిండియా మాత్రమే మన దేశంలో ఎఫ్‌ఎస్‌సీగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది.