Anna University Sexual Assault Case: అన్నా యూనివర్సిటీలో విద్యార్ధినిపై లైంగిక వేధింపులు..  కోర్టు సంచలన తీర్పు

అన్నా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్ధినిపై లైంగిక దాడి ఘటనపై చెన్నై మహిళా కోర్టు న్యాయమూర్తి రాజలక్ష్మి తీర్పు వెలువరించారు. జ్ఞానశేఖరన్‌ను దోషిగా ప్రకటిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు అతనికి ఇంకా శిక్ష విధించలేదు.

New Update
anna-university

Anna University Sexual Assault Case

Anna University Sexual Assault Case: చెన్నైలోని అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఓ విద్యార్ధినిపై లైంగిక దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసుపై చెన్నై మహిళా కోర్టు న్యాయమూర్తి రాజలక్ష్మి తీర్పు వెలువరించారు.  జ్ఞానశేఖరన్‌ను దోషిగా ప్రకటిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నై క్యాంపస్‌లో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన 11 అభియోగాల్లో ఐదు నెలల విచారణ తర్వాత జ్ఞానశేఖరన్‌ను మహిళా కోర్టు దోషిగా తేల్చింది కానీ అతనికి ఇంకా శిక్షను ఖరారు చేయలేదు. ఈ కేసుకు సంబంధించిన ఇతర వివరాలను జూన్ 2న ప్రకటిస్తామని పోలీస్ ప్రాసిక్యూటర్ మేరీ జయంతి తెలిపారు. ఈ కేసులో 29 మంది సాక్షులు సాక్ష్యం చెప్పగా, 100 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేయబడింది.  బాధితురాలికి పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి గతంలోనే హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. 

 Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

 Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!

ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు 

గత ఏడాది డిసెంబర్ 23న చెన్నైలోని అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో జ్ఞానశేఖరన్ అనే వ్యక్తి ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కొత్తూరుపురం పోలీసులు కేసు నమోదు చేసి జ్ఞానశేఖరన్‌ను అరెస్టు చేశారు. నిందితుడికి అధికార డీఎంకే పార్టీతో సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి.  చెన్నైలోని గిండీ ప్రాంతంలో 180 ఎకరాల విస్తీర్ణంలో అన్నా యూనివర్సిటీ ఉంది. ఈ క్యాంపస్‌లోనే గిండీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఏసీటీ (ACT) క్యాంపస్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (SAP) కూడా ఉన్నాయి.  13 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. క్యాంపస్ ఆవరణలో మూడు హాస్టళ్లు  ఉన్నాయి.

Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!

     

    Advertisment
    Advertisment
    తాజా కథనాలు