/rtv/media/media_files/2026/01/06/fotojet-86-2026-01-06-16-50-07.jpg)
A woman has given birth to her 11th child - a BOY, after having 10 daughters.
Jind, Haryana : హర్యానాలోని జింద్ జిల్లాలోని ఉచానా ప్రాంతంలోని ఒక కుటుంబం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది, 40 ఏళ్ల మహిళ 10 మంది కుమార్తెలను కన్న తర్వాత తన 11వ సంతానంగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. జనవరి 5, 2026న ప్రసవం జరగగా తల్లీ బిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. తన కుటుంబానికి వారసత్వంగా కొడుకు కావాలన్న భర్త కోరిక కారణంగా ఆమె పిల్లల్ని కంటూ వచ్చింది. అలా ఇప్పటివరకు పదిమంది ఆడపిల్లలు పుట్టగా 11వ సంతానంగా మగపిల్లాడు పుట్టడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేవు. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి మీడియాకు చేరడంతో పలువురు మీడియా రిపొర్టర్లు వారి ఇంటికి క్యూ కడుతున్నారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ విషయం లింగ పక్షపాతం, కుటుంబ నియంత్రణ ,జనాభా పెరుగుదల తదితర సామాజిక అంశాలను తెరమీదకు తెచ్చింది.
Jind, Haryana: A woman has given birth to her 11th child - a BOY, after having 10 daughters.
— Dr Ranjan (@AAPforNewIndia) January 6, 2026
The Govt should take away all 11 children; these parents clearly aren't fit to raise them. pic.twitter.com/X8fneVnJAK
అయితే ఆ పిల్లల తండ్రిని కలిసి.. 10 మంది ఆడ పిల్లల పేర్లు చెప్పమని అడిగితే.. పది మందిలో కొందరి పేర్లను కూడా సదరు తండ్రి మర్చిపోవడం గమనార్హం. పదకొండు మంది పిల్లలను ఎలా పెంచి పోషించి ప్రయోజకులను చేయాలనే ఆందోళన కంటే ఒక్క మగ పిల్లాడు పుట్టాడనే ఆనందమే ఆ కుటుంబంలో కనిపించడం చూసి మిడియా వర్గాలు విస్తుపోతున్నాయి. అంతేకాదు మగ పిల్లాడు పుట్టిన సంతోషంలో ఆ కుటుంబం స్వీట్లు పంచి, ఆసుపత్రిని బెలూన్లతో అలంకరించి సంబరాలు చేసుకుంది. కాగా వారసత్వంపై ఎందుకు ఇంత ఆరాటం అని ఆ తండ్రిని అడిగితే.. తన కూతుళ్లు తమ కోసం ఒక తమ్ముడిని తీసుకురావాలని అడిగారని చెప్పడం గమనార్హం.
కుటుంబ నియంత్రణ,చిన్న కుటుంబాల గురించి ప్రజలు మాట్లాడుకునే ఈ రోజుల్లో, చాలా మంది పిల్లలు ఉండటం అసాధారణంగా అనిపిస్తుంది. అయితే కొడుకు కోసం తాము ప్రయత్నిస్తూనే ఉన్నామని కుటుంబం చెబుతోంది. గ్రామీణ ప్రాంత ప్రజలు వారి కుటుంబానికి ఒక కొడుకు కావాలని కోరుకుంటున్నారు. భారతదేశం లాంటి దేశంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, కొడుకు కావాలనే కోరిక ఇప్పటికీ లోతుగా నాటుకుపోయింది. ఒక కొడుకు వంశపారంపర్యంగా కొనసాగుతాడని,వృద్ధాప్యంలో వారికి అండగా ఉంటాడని ప్రజలు నమ్ముతారు.
అయితే సమాజంలో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ఎలాంటి ఎక్కువతక్కువ పరిస్థితులు ఉండవని.. ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని.. అయినప్పటికీ కొన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మగ బిడ్డపై మమకారంతో ఇలా స్తోమతకు మించి పిల్లలను కని పోషించలేక ఇబ్బంది పడుతున్నారని కొందరు నెటిజన్లు ఈ ఘటనపై స్పందించారు.
Follow Us