/rtv/media/media_files/2025/03/17/sunita-williams011-296804.jpg)
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు 9 నెలల తర్వాత భూమి మీదకు తిరిగి రానున్నారు. వారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి 2024 జూన్‌లో వెళ్లారు.
/rtv/media/media_files/2025/03/17/sunita-williams010-999836.jpg)
ఆ తర్వాత ఆ హోమగాములు అక్కడే చిక్కుకుపోయారు. ఇక ఇన్ని నెలలకు వారు తిరిగి భూమ్మీదకు రానున్నారు. 2025 మార్చి 18న అడుగుపెట్టనున్నారు.
/rtv/media/media_files/2025/03/17/sunita-williams3-642440.jpg)
ఈ క్రమంలో సునీతా విలయమ్స్కు సంబంధించిన కొన్ని రేర్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె కాంగ్రెస్ నేత సోనియా గాంధీతో దిగిన ఒక ఫొటో నెట్టింట చెక్కర్లు కొడుతోంది.
/rtv/media/media_files/2025/03/17/sunita-williams2-863664.jpg)
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను పాలక యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (United Progressive Alliance) (యుపిఎ) ప్రభుత్వ ఛైర్పర్సన్ సోనియా గాంధీ సెప్టెంబర్ 29, 2007న న్యూఢిల్లీలోని తన నివాసంలో స్వాగతించారు.
/rtv/media/media_files/2025/03/17/sunita-williams-441092.jpg)
అలాగే సునీత విలియమ్స్ ప్రముఖ వ్యాపార వేత్తలైన ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రాతో దిగిన రేర్ పిక్స్ సైతం అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
/rtv/media/media_files/2025/03/17/sunita-williams1-720016.jpg)
మాధవన్, ఇస్రో ఇంజనీర్ నంబి నారాయణన్ టెక్సాస్‌లో సునీతా విలియమ్స్‌ను కలిశారు. ఈ మేరకు ‘‘స్పేస్ట్రావెల్కు సంబంధించిన ఇద్దరు పద్మభూషణ్ అవార్డు గ్రహీతలతో కలిసి నిలబడే సూపర్ అరుదైన అవకాశం. నేను హై హెవెన్స్‌లో ఉన్నాను. సునీతా విలియమ్స్‌ను కలవడం చాలా ఉత్తేజకరమైన అనుభవం’’ అని మాధవన్ తెలిపాడు.
/rtv/media/media_files/2025/03/17/sunita-williams6-771947.jpg)
పైనున్న ఫొటో చాలా రేర్. సునీతా విలియమ్స్ అండ్ డయానా తమ భారతీయ వారసత్వాన్ని కలిగి ఉండటంతో ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఇది ఆమె సాంస్కృతిక మూలాలపై ఆమెకున్న గర్వాన్ని ప్రతిబింబిస్తుంది.
/rtv/media/media_files/2025/03/17/sunita-williams4-617304.jpg)
అంతేగాక సునీతా విలియమ్స్ భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక కట్టడాల్లో ఒకటైన తాజ్ మహాల్‌ను కూడా సందర్శించారు. సునీతా విలియమ్స్, ఆమె సోదరి ఆగ్రాలోని తాజ్ మహల్ ముందు పోజులిచ్చారు.
/rtv/media/media_files/2025/03/17/sunita-williams7-879072.jpg)
ఈ ఫొటో అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడందరూ సునీతా విలియమ్స్ తన సూట్లో స్పేస్‌లో ఉండటం చూశారు. కానీ ఆమె యువతిగా ఉన్న సమయంలో చాలా అందంగా ఉండేవారు. ఇక్కసారి ఈ ఫొటో చూస్తే మీకే అర్థం అవుతుంది.