BIG BREAKING: విషాదం.. తెగిపడిన రోప్‌వే.. ఆరుగురు మృతి

గుజరాత్‌లో విషాదం చోటుచేసుకుంది. పావగఢ్‌లోని సామాగ్రిని తరలిస్తుండగా రూప్‌వే తెగిపడిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

New Update
FotoJet 6 killed after cargo ropeway collapses at Shakti Peeth in Gujarat(3)

6 killed after cargo ropeway collapses at Shakti Peeth in Gujarat

గుజరాత్‌లో విషాదం చోటుచేసుకుంది. పావగఢ్‌లోని సామాగ్రిని తరలిస్తుండగా రూప్‌వే తెగిపడిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు పోలీసులు హుటాహూటీనా ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఆ ప్రాంతంలో 800 మీటర్ల ఎత్తులో ఓ ఆలయం ఉంది. అక్కడికి చేరాలంటే 2 వేల మెట్లు ఎక్కాలి. దీంతో అక్కడికి వచ్చే యాత్రికులు ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్తారు. మరికొందరు కేబుల్ కార్స్‌ సదుపాయాన్ని వినియోగించుకుంటారు. అయితే అక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పబ్లిక్ రోప్‌వేను శనివారం ఉదయం నుంచి మూసివేశారు. అయితే సామాగ్రిని తరలిస్తుండగా రోప్‌వే తెగిపడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

Advertisment
తాజా కథనాలు