Delhi: మా బాబు కదా...మీరు ఇంటి నుంచే పని చేయండి!

ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకి మరింత క్షీణిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400లకు పైగా నమోదవుతుంది. ఈ నేపథ్యంలో 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

New Update
air

Delhi:దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకి మరింత క్షీణిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400లకు పైగా నమోదవుతుంది. ఈ నేపథ్యంలో 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాలుష్య తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి గోపాల్‌రాయ్‌ పేర్కొన్నారు. 

Also Read: AP :ఏపీలో రూ.99కే మద్యం..మందుబాబులకు ఇక పండగే పండగ!

కాగా, నేడు సచివాలయ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు  ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి చెప్పారు. ఢిల్లీలోని మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. మిగిలిన ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు పని చేయనున్నాయనున్నాయి. ఇప్పటికే ఒకటి నుంచి 11వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Telangana: పంజా విసురుతున్న చలి పులి...దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

అయితే, ఢిల్లీలో గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతుండంతో.. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం గాలి నాణ్యత సూచీ 422గా రికార్డైంది. చాలా ప్రాంతాల్లో ఇది 500 మార్క్‌ను దాటడంతో వాతావరణ శాఖ అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. దీని వల్ల ఇప్పటికే పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.

Also Read: Soudi: రాజద్రోహం, అత్యాచారం నేరాల కింద సౌదీలో ఈ ఏడాది 214 మంది ఉరి!

కాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టులోని ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్‌  గా పాల్గొని తమ వాదనలు వినిపించొచ్చని సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా అన్నారు. ఇక, వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కోరినట్లు తెలుస్తుంది.

Also Read: విరిగిన ముక్కలు మళ్లీ పూర్వంలా.. విడాకులు పై నోరు విప్పిన రెహమాన్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు