దారుణం.. ప్రియుడి ముందే యువతిపై ఎనిమిది మంది గ్యాంగ్ రేప్‌..

అస్సాంలో దారుణం జరిగింది. ఓ 28 ఏళ్ల యువతిని తన ప్రియుడి ముందే కొందరు దుండగులు గ్యాంగ్‌ రేప్ చేశారు. ఆ తర్వాత వాళ్లనుంచి బలవంతంగా డబ్బులు తీసుకున్నారు.

New Update
28-Year-Old Woman Gang-Raped By 7-8 Men In Assam

28-Year-Old Woman Gang-Raped By 7-8 Men In Assam

అస్సాంలో దారుణం జరిగింది. ఓ 28 ఏళ్ల యువతిని తన ప్రియుడి ముందే కొందరు దుండగులు గ్యాంగ్‌ రేప్ చేశారు. ఆ తర్వాత వాళ్లనుంచి బలవంతంగా డబ్బులు తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిల్చార్‌లోని ఫిబ్రవరి 19న అర్ధరాత్రి చెంగ్‌కురి బైపాస్‌ రోడ్డుపై ఓ కారు పార్క్‌ చేసి ఉంది. అందులో ఓ యువతి, ఆమె ప్రియుడు ఉన్నారు. అదే సమయంలో SUV కారు నుంచి ఎనిమిది మంది వ్యక్తులు దిగారు. ఆ జంట వద్దకు వెళ్లి కత్తితో బెదిరించారు. వారిపై దాడి చేసి దూరంగా లాక్కెళ్లారు. ఆ తర్వాత ఆ యువతిని ఒక్కొక్కరుగా తన ప్రియుడి ముందే రేప్ చేశారు. 

అనంతరం నిందితులు ఆ యువతి గోల్డ్‌ రింగ్‌ను తీసుకున్నారు. అలాగే తన బాయ్‌ఫ్రెండ్‌ నుంచి రూ.10 వేలు యూపీఐ పేమెంట్‌ ద్వారా బదిలీ చేయించుకున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.  కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఒక అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సిల్చార్‌కు చెందిన నిలోత్పర్‌ దాస్‌(25)గా గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని.. మిగతా నిందితులను కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అస్సాంకు చెందిన టీఎంసీ నేత, రాజ్యసభ ఎంపీ సుశ్మిత దేవి కూడా ఈ ఘటనపై స్పందించారు. కొందరు నేతలు ఇతర రాష్ట్రాల్లోని మహిళల భద్రత గురించి మాట్లాడుతారని.. కానీ వారి సొంత రాష్ట్రంలోనే మహిళలకు భద్రత లేదంటూ విమర్శించారు. 

Advertisment
తాజా కథనాలు