Mahavatar Narsimha: మైథలాజికల్ యానిమేషన్ సిరీస్ మహావతార్ నరసింహా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. హాఫ్ సెంచరీతో సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ కొనసాగించింది. భారతీయ యానిమేషన్ చిత్రాల్లో ఒక కొత్త ట్రెండ్ ని సృష్టించింది. తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన వీఎఫెక్స్, కథ, కథనంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
ఓటీటీలో మహావతార్ నరసింహ
సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది. థియేటర్స్ లో ఈ చిత్రాన్ని మిస్సయిన వారు ఇప్పుడు ఓటీటీలో ఎంజాయ్ చేయవచ్చు.
హాలీవుడ్ రేంజ్ యానిమేషన్
వయసుతో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది మహావతార్ నరసింహా. ముఖ్యంగా ఈ సినిమాలో యానిమేషన్ వర్క్ విమర్శకుల ప్రశంసలు పొందింది. హాలీవుడ్ యానిమేషన్ చిత్రాలకు దీటుగా విజువల్స్ ఉన్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా హిరణ్యకశిపుడు, నరసింహ స్వామి మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు..