మహారాష్ట్రలోని నాసిక్‌లో తీవ్ర విషాదం జరిగింది. ఫైరింగ్ ప్రాక్టీస్ సమయంలో షెల్ పేలి ఇద్దరు అగ్నివీరులు ప్రాణాలు విడిచారు. నాసిక్ జిల్లాలోని ఆర్టిలరీ సెంటర్‌లో గురువారం మధ్యాహ్నం ఈ విషాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చదవండి: బతుకమ్మ సంబరాల్లో విషాదం.. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
మిస్ ఫైర్ కారణంగా మృతి
నాసిక్ రోడ్డులోని ఆర్టిలరీ సెంటర్‌లో అగ్నివీరుల బృందం ఫీల్డ్ గన్‌తో ఫైరింగ్ చేస్తుంది. అందులోని ఒక షెల్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విశ్వరాజ్ సింగ్ (20), సైఫత్ షిత్ (21)లను వెంటనే దియోలలీలోని మిలటరీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే వారిద్దరు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: విషాదం.. భర్త, ఇద్దరు కుమారుల మృతి.. ‘మీరు లేని జీవితం నాకొద్దు’
కాగా వీటిని ప్రమాదవశాత్తు మరణాలుగా కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే కొందరు అగ్నివీరులు మరణించారు. రాజస్థాన్‌లోని భరత్ పూర్‌లో మాక్ డ్రిల్ సమయంలో జరిగిన పేలుడులో ఒక అగ్నివీర్ మరణించాడు.
ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మందికి తీవ్ర గాయాలు
అలాగే సేవార్ పోలీస్ స్టేషన్ పరిధి గోల్‌పుర ఆర్మీ శిక్షణ కేంద్రంలో కూడా అగ్నివీరులు మాక్ డ్రిల్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. ఇందులో సౌరభ పాల్ అనే అగ్నివీరుడు చనిపోయాడు.