/rtv/media/media_files/2024/10/22/adPhl2lmNAcHMUU2lOpq.jpg)
బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నిర్మాణంలో ఉన్న భవం కుప్పకూలింది. ఈ భవనం శిథిలాల కింద 17 మంది వరకు చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ముగ్గురిని సురక్షితంగా బయటికీ తీశామని.. మిగతా వారని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. తూర్పు బెంగళూరులోని బాబుసపల్య వద్ద మంగళవారం సాయంత్రం 4.10 గంటలకు ఒక్కసారిగా ఆ భవనం కోల్పోయింది. సమాచారం మేరకు సహాయక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నాయి. ఈ భవనం కింద చిక్కుకున్నవారిలో కొందరు చనిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
Also Read: వక్ఫ్ బోర్డ్ బిల్లుపై ఘర్షణ.. వాటర్ బాటిల్‌ను పగలగొట్టిన టీఎంసీ నేత
బెంగళూరులో అత్యధిక వర్షపాతం
ఇదిలాఉండగా గత కొద్దిరోజులుగా బెంగళూరులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రికార్డు స్థాయిలో వర్షం కరిసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఉదయం 8.30 నుంచి 186.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. 1997 అక్టోబర్ 1న అక్కడ 178.9 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ రికార్డు బ్రేక్ అయ్యింది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ఇలా నిర్మాణంలో ఉన్న భవనం కూలడం కలకలం రేపుతోంది.
Also Read: బ్రిజ్ భూషణ్ బెడ్‌పై కూర్చున్నాను.. ఆ సమయంలో.. : సాక్షి మాలిక్
ప్రస్తుతం దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల వరదలు పోటెత్తుతున్నాయి. భారీ వర్షాల ప్రభావానికి ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు కూలిపోయిన ఘటనలు గతంలో కూడా చాలానే జరిగాయి. ఈ ఏడాది ఆగస్టులో రాజస్థాన్‌లోని జైపూర్‌లో కూడా ఓ బహుళ అంతస్తుల భవనం భారీ వర్షాల కారణంగా కూలిపోయింది. దీంతో భారీ వర్షాల వల్ల ప్రజలు భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇటీవల కేరళలోని వయనాడ్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. మరోవైపు చైనా, అమెరికా, జపాన్ తదితర దేశాల్లో కూడా వరదలు సంభవించాయి.
Also Read: పుతిన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం.. దానిపైనే ఫోకస్!
Also Read: కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షిపై సంచలన ఆరోపణలు