• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

RTV NEWS NETWORK

RTV NEWS NETWORK

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • విజయవాడ
  • వైజాగ్
  • Opinion
  • 🗳️Elections
Home » ఇంటి అద్దె చెల్లించని వ్యక్తితో నాలుగేళ్లుగా పోరాటం!

ఇంటి అద్దె చెల్లించని వ్యక్తితో నాలుగేళ్లుగా పోరాటం!

Published on July 26, 2023 7:48 pm by Shareef Pasha

ఖాళీగా ఉంది కదా అని ఇల్లు అద్దెకిచ్చిన పాపానికి ఇంటి యజమానికి పట్టపగలే చుక్కలు కనిపించాయి.రూం అద్దెకు తీసుకున్న వ్యక్తి ఓనర్‌కి అద్దె కట్టకపోవడంతో కోర్టు చుట్టూ తిరిగాల్సి వచ్చింది.నెల కాదు, రెండు నెలలు కాదు ఏకంగా రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేసి అద్దె చెల్లించని వ్యక్తిని ఇంటి నుంచి వెళ్లగొట్టాల్సి వచ్చింది.ఈ చేదు అనుభవం ఏకంగా ప్రముఖ కార్పొరేట్ సంస్థ క్యాపిటల్ మైండ్ సీఈఓకు ఎదురయ్యింది.ఆయన ఆవేదనను తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు.అంతేకాదు రియల్ ఎస్టేట్ చేయడం అంత ఈజీ కాదని పేర్కొన్నారు.

Translate this News:

national-news-capital-mind-ceo-deepak-shenoy-shares-struggle-of-pain-staking-court-battle-for-tenant-refused-to-pay-rent 

పూర్తిగా చదవండి..

ఓ కార్పొరేట్ సంస్థ సీఈఓ ఇంట్లో అద్దెకు దిగిన వ్యక్తి మొదటి నెల తర్వాత ఇంటి అద్దె చెల్లించడం మానేశాడు.దీంతో అతడిని ఖాళీ చేయించడానికి రెండేళ్లు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. తనకు ఎదురైన ఈ విచిత్రమైన అనుభవాన్ని బెంగళూరుకు చెందిన కార్పొరేట్ ఫైనాన్స్ అడ్వైజరీ కంపెనీ క్యాపిటల్ మైండ్ వ్యవస్థాపకుడు,సీఈఓ దీపక్ షెనాయ్‌కు సోషల్ మీడియాలో పంచుకున్నారు. మొదటి నెల తర్వాత అద్దె చెల్లించని ఆ వ్యక్తిని ఫ్లాట్ నుంచి బయటకు పంపడానికి తన తల్లికి రెండేళ్లు పట్టిందని ఆయన పేర్కొన్నారు.షెనాయ్ తనకు ఎదురైన అనుభవం గురించి వివరాలను రాసుకొచ్చాడు.

సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఫ్లాట్‌ స్వాధీనం

national-news-capital-mind-ceo-deepak-shenoy-shares-struggle-of-pain-staking-court-battle-for-tenant-refused-to-pay-rent

నాలుగేళ్లు సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత అద్దెకు దిగిన వ్యక్తి నుంచి ఫ్లాట్‌ను విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన పెద్దాయన గురించి వార్తా పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా తన పోస్ట్‌కు జతచేశారు.వ్యక్తిగతంగా ఇలా జరిగింది.మొదటి నెల తర్వాత అద్దె చెల్లించడానికి నిరాకరించిన అద్దెదారుని ఖాళీ చేయమని అమ్మ రెండు సంవత్సరాల పాటు ప్రతి రెండు నెలలకు ఒకసారి కోర్టుకు వెళ్లింది.ఇంతకు ముందు వేరేవాళ్లను ఇలాగే వేధించారని అతడు కూడా తిరిగి మాపై కేసు పెట్టాడంటూ చెప్పుకొచ్చారు. కోర్టు ఉత్తర్వులు రావడానికి రెండు ఏళ్లు పట్టిందని తెలిపారు.ఆ తర్వాత అతడ్ని బయటకు పంపడానికి మరో మూడు నెలలు పట్టిందంటూ రాసుకొచ్చారు. పోలీసులు రావడానికి ముందు రోజు ఆ మోసగాడు ఖాళీ చేసి వెళ్లిపోయాడని తెలిపారు.

గతంలోనూ సేమ్‌ సీన్ రిపీట్

Personally went through this…Mom went to the court house for two years once every two months to evict a tenant who refused to pay rent after the first month. He also filed a case saying henchmen used just like that. Had done this with other people too.

It took two years to get… https://t.co/cDTHu1DsGq

— Deepak Shenoy (@deepakshenoy) July 25, 2023

ఈ భయానక అనుభవం తన తల్లిని ఎంతగానో ప్రభావితం చేసిందని ఆమె తన ఆస్తులను చాలావరకు విక్రయించిందని చెప్పారు.ఆ తర్వాత అమ్మ స్థిరాస్తులన్నీ అమ్మేసి ఇప్పుడు తనకున్న ఒకే ఒక్క ఇంటిలో నివసిస్తోంది.కొంత భూమిని రౌడీలు ఆక్రమించుకున్నారని వాపోయారు.రియల్ ఎస్టేట్ మాకు కలిసి రాలేదు.చాలా తక్కువ మొత్తంతో మా ద్వారా మార్కెట్‌లో ఎక్కువ డబ్బులు సంపాదించారని క్యాపిటల్ మైండ్ CEO జోడించారు.కాగా గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.బెంగళూరులోని జేపీ నగర్‌లో ఓ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి వేణుగోపాల్ మెట్టూరు పద్మనాభన్ 2019లో తన ఇంటిని ఓ జంటకు అద్దెకు ఇచ్చారు.ఓ ఇంట్లో అద్దెకు దిగిన దంపతులు అడ్వాన్స్ కింద రూ.లక్షకు చెక్ ఇచ్చారు.అయితే నెల నెల అద్దె చెల్లించకపోగా వాళ్లు ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది.దీంతో ఆయన కోర్టుకు వెళ్లడంతో నాలుగేళ్ల పాటు పోరాటం సాగించారు.ఇటీవలే ఆయనకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది.

[vuukle]

Primary Sidebar

Bigg Boss 7 Telugu: "మంచి అనిపించుకోవడానికి డ్రామాలు అంతే".. యావర్ పై అరిచేసిన అమర్..!

Bigg Boss 7 Telugu: “మంచి అనిపించుకోవడానికి డ్రామాలు అంతే”.. యావర్ పై అరిచేసిన అమర్..!

Revanth Modi: 'అన్ని విధాలా తోడుగా ఉంటా..' రేవంత్‌కు మోదీ బెస్ట్‌ విషెస్!

Revanth Modi: ‘అన్ని విధాలా తోడుగా ఉంటా..’ రేవంత్‌కు మోదీ బెస్ట్‌ విషెస్!

Stock Market

Stock Market: మూడురోజుల దూకుడుకు బ్రేక్.. స్టాక్ మార్కెట్ స్వల్ప తగ్గుదల 

India vs South Africa

India vs South Africa: సౌతాఫ్రికాలో టీమిండియా తీరిది.. ఈసారైనా ఆ ఘనత సాధిస్తారా?

Pakistan Cricket: జాత్యహంకార స్కోరు కార్డు.. క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా!

Pakistan Cricket: జాత్యహంకార స్కోరు కార్డు.. క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా!

Apara Sanjeevani Bhringaraju in Ayurveda..Wonderful benefits of oil

Bhringraj Benefits: ఆయుర్వేదంలో అపర సంజీవని భృంగరాజు..నూనెతో అద్భుత ప్రయోజనాలు

Salaar Second Trailer

Salaar :మొదటిదానిలో దేవా..రెండో దానిలో సలార్..ట్రైలర్ ఇరగదీయాల్సిందే

IND VS SA: టీమిండియాకు మరో 3D బౌలర్? ఆల్‌రౌండర్‌ కొరత తీరనుందా?

IND VS SA: టీమిండియాకు మరో 3D బౌలర్? ఆల్‌రౌండర్‌ కొరత తీరనుందా?

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online