టీవల ఎన్నికలకు ముందు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడంతో గత బీఆర్‌ఎస్ ప్రభత్వంపై తీవ్రంగా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మేడిగడ్డలో కుంగిన ప్రాంతాన్ని వేరుచేసి.. నీటిని తొలగించిన తర్వాత.. వంతెన వైఫల్యానికి కారణాలను అధ్యయనం చేసేందుకు సమాచారం ఇవ్వాలని కోరినా తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని.. జాతీయ డ్యాం సెప్టీ అథార్టీ తెలిపింది. అయితే జాతీయ అథారిటీ, సీడబ్ల్యూసీ అధికారుల బృందం మళ్లీ పరిశీలించి వైఫల్యానికి దారి తీసిన కారణాలను మరింత తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది. అలాగే నేషనల్ డ్యాం సెఫ్టీ అధికారం చట్టం ప్రకారం రాష్ట్రప్రభుత్వం చేసిన పరిశీలనలను కచ్చితంగా తమకు పంపాలని తెలిపింది. ఆమెరకు తెలంగాణ రాష్ట్ర డ్యాం సెప్టీ అథార్టీకి జాతీయ అథార్టీ లేఖ రాసింది.
Also read: మంత్రి సీతక్క స్వగ్రామానికి ఎట్టకేలకు రానున్న ఆర్టీసీ బస్సు..
అయితే ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, పియర్స్ దెబ్బతినడం వల్ల జాతీయ అథార్టీ అధికారులు దాన్ని పరిశీలించి నివేదికను రూపొందించారు. ఇందులో డిజైన్, నిర్మాణం, నిర్వహణ, నాణ్యతా లోపాలతో పాటు వాటి వైఫల్యాలకు సంబంధించి.. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శికి లేఖ రాశారు. అయితే దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. బ్యారేజీ కుంగిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడంలో సహకరించకుండా నిందారోపణలను చేయడం తగదంటు కేంద్రానికి తెలిపింది. అయితే ఇప్పుడు జాతీయ డ్యాం సెప్టీ అథార్టీ మళ్లీ రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: రాష్ట్రాన్ని వణికిస్తోన్న చలి.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి..!