Nation With Pandya: హార్దిక్‌కు మద్దతుగా కోహ్లీ, ధోనీ ఫ్యాన్స్‌.. ఈ ప్రేమ వెనుక కారణాలేంటి?

ముంబై కెప్టెన్‌పాండ్యాకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు కోహ్లీ,ధోనీ ఫ్యాన్స్. SRHపై మ్యాచ్‌లో పాండ్యా బ్యాటింగ్‌ కారణంగానే ముంబై ఓడిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రోహిత్‌ ఫ్యాన్స్‌ పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. నేషన్‌ విత్‌ పాండ్యా అంటూ ధోనీ, కోహ్లీ ఫ్యాన్స్‌ ట్రెండ్‌ చేస్తున్నారు.

New Update
Nation With Pandya: హార్దిక్‌కు మద్దతుగా కోహ్లీ, ధోనీ ఫ్యాన్స్‌.. ఈ ప్రేమ వెనుక కారణాలేంటి?

We Stand With Pandya HashTag Trends On Twitter: ఐపీఎల్‌ అంటే ఫ్యాన్‌ వార్స్‌ సాధారణమే. ఇది కొన్నిసార్లు శృతి మించుతుంటుంది. ప్లేయర్లపై వ్యక్తిగతంగా మాటల దాడి చేయడం, అసభ్యకరమైన ట్రోల్స్ చేయడం నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా పాండ్యా విషయంలోనూ అదే జరుగుతోంది. రెండు వర్గాలుగా చీలిపోయిన ముంబై ఫ్యాన్స్‌లో రోహిత్‌ శర్మ ఫ్యాన్‌బేస్‌ ఒకటి. వీరంతా పాండ్యాను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. పాండ్యా కూడా ప్లేయరేనన్న విషయాన్ని మర్చి అసభ్యకరమైన రీతిలో పోస్టులు పెడుతున్నారు. రోహిత్‌ను పక్కన పెట్టి ఈ ఏడాది కెప్టెన్సీ బాధ్యతలను ముంబై పాండ్యాకు అప్పగించడమే దీనికి ప్రధాన కారణం. ఇప్పటికే ఆ కోపం నుంచి చల్లారని రోహిత్ ఫ్యాన్స్‌ పాండ్యా చేసిన కెప్టెన్సీ తప్పిదాలను హైలెట్ చేస్తున్నారు. నిజానికి హైదరాబాద్‌పై పాండ్యా గెలవలాన్న ఇంటెంట్‌తో ఆడలేదని మ్యాచ్‌ చూసిన వారికి కూడా అర్థమవుతుంది. పాండ్యాలో మునపటిలా ఆడలాన్న కసి కూడా కనిపించలేదు. బౌలింగ్‌ సమయంలో కెప్టెన్‌గా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. దీంతో రోహిత్‌ ఫ్యాన్స్‌కు మంచి స్టఫ్‌ దొరికింది.


నేషన్‌ విత్‌ పాండ్యా:
ఇలా ఓవైపు పాండ్యాపై రోహిత్‌ ఫ్యాన్స్‌ ఘోరమైన విమర్శలు చేస్తుంటే మరోవైపు ధోనీ, కోహ్లీ ఫ్యాన్స్‌ పాండ్యాకు మద్దతుగా నిలుస్తున్నారు. నేషన్‌ విత్‌ పాండ్యా అటూ భారీ భారీ హ్యాష్‌ట్యాగ్‌లు క్రియేట్ చేసి ట్రెండింగ్‌ చేస్తున్నారు. నిజానికి నేషన్‌ విత్‌ అంటే చాలా పెద్ద పదం. ఇది చిల్లర ట్రోల్స్‌కు కౌంటర్‌గా యూజ్‌ చేయడం విడ్డూరంగా అనిపిస్తోంది. అయితే అసలు పాండ్యాకు రోహిత్‌, కోహ్లీ ఫ్యాన్స్‌ ఎందుకు సపోర్ట్‌గా నిలుస్తున్నారన్నదే పెద్ద ప్రశ్న.

అసలు కారణం ఇదే:
హార్దిక్‌కు ధోనీకి చాలా మంచి రిలేషన్‌ ఉంది. వీరిద్దరూ బయట బాగా కలుస్తారు కూడా. గతేడాది ఐపీఎల్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు ముందు అప్పుడు గుజరాత్‌ కెప్టెన్‌గా ఉన్న పాండ్యా చేసిన వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ ధోనీ ఫ్యాన్స్‌ హార్దిక్‌కు సపోర్ట్ ఇస్తున్నారు. ధోనీ చేతిలో ఓడిపోవడానికి ఎలాంటి ప్రాబ్లెమ్‌ లేదని నాడు పాండ్యా చెప్పుకొచ్చాడు. నిజానికి ఒక జట్టు కెప్టెన్ చెప్పాల్సిన మాటలు కావు ఇవి. కానీ ఆ సమయంలో ధోనీ భజన ఓ రేంజ్‌లో ఉంది. అందుకే పెద్దగా ఎవరూ పాండ్యా మాటలను వ్యతిరేకించలేదు. ఇలా పాండ్యాతో ధోనీకి ఉన్న స్నేహం కారణంగా హార్దిక్‌కు MSD ఫ్యాన్స్‌ మద్దతుగా నిలుస్తున్నారు. అటు కెప్టెన్‌గా రోహిత్‌ సక్సెస్‌ విషయంలో కోహ్లీ ఫ్యాన్స్‌ నిత్యం అసూయగా వ్యవహారిస్తుంటారు. రోహిత్‌ ఏం చేసినా తిరిగి ఏదో ఒక ట్రోల్ చేస్తుంటారు. ఇలా కోహ్లీ ఫ్యాన్స్‌ పాండ్యాకు సపోర్ట్‌గా హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో పాల్గొన్నారు. అంతే కానీ ఈ ఇద్దరి ఫ్యాన్స్‌కు పాండ్యాపై ప్రేమ ఉండి కాదు.. అంతా రోహిత్‌పై వ్యతిరేకతతోనే ఈ డ్రామా లవ్‌!

Also Read: బుస్ బుస్🐍 టుక్ టుక్ హార్దిక్‌ 🏏.. నిజస్వరూపం బయట పడిందిగా!