నడవలేనిస్థితిలో ఇంటి పెద్ద.. కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేసిన కుల పెద్దలు

నిర్మల్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. లోకేశ్వరం మండలం పిప్రీ గ్రామానికి చెందిన నరేష్ గౌడ్ కుటుంబం కుల, గ్రామ బహిష్కరణకు గురైంది. రోడ్డు ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగినందుకు గ్రామాభివృద్ధి కమిటీకి చెల్లించే డబ్బులు చెల్లించలేదని ఈ తీర్మాణం చేసినట్లు పోలీసులకు కంప్లైట్ చేశాడు.

నడవలేనిస్థితిలో ఇంటి పెద్ద.. కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేసిన కుల పెద్దలు
New Update

నిర్మల్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఒకవైపు మనిషి చంద్రుని మీద కాలు మోపేందుకు ప్రయత్నాలు చేస్తుంటే మరికొందరు తమ ఉనికిని కాపాడుకునేందుకు కుల, మతం పేరుతో గ్రామాల్లో దారుణాలకు పాల్పడుతున్నారు. తమ పెద్దరికాన్ని కాపాడుకుంటూ, వారసత్వాన్ని పునికిపుచ్చుకునేందుకు అమాయక ప్రజలపై ప్రతాపం చూపుతున్నారు. కుల సంఘాల పేరిట డబ్బులు వసూల్ చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. ఇది అన్యాయమని ప్రశ్నించిన వారిని కుల బహిష్కరణ పేరుతో హింసించడం, ఊరినుంచి వెలేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. పోలీసులు, న్యాయస్థానాలు ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలకు తీసుకుంటున్నప్పటికీ అక్కడక్కడ రిపీట్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి క్రూరమైన ఘటన నిర్మల్ జిల్లోలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగి నడవలేని స్థితిలో ఉన్న కల్లుగీత కార్మికుని కుటుంబం తాము అడిగిన డబ్బులు ఇవ్వలేదని ఆ కుల పెద్దలు కుల, గ్రామ బహిష్కరణ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఈ మేరకు నిర్మల్ జిల్లాలో లోకేశ్వరం మండలం పిప్రీ గ్రామానికి చెందిన బాధితుడు నరేష్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత కొద్ది కాలంగా కల్లుగీత వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అయితే ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాను. దీంతో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ప్రతి సంవత్సరం గ్రామాభివృద్ధి కమిటీకి చెల్లించే డబ్బులు సకాలంలో చెల్లించలేదు. దీంతో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సమావేశమై సమావేశ స్థలానికి రావాలని పిలిచారు. కానీ కాలు, చేయి విరిగి కదలలేని స్థితిలో ఉన్నందున నేను రాలేనని చెప్పాను. అయితే కుల పెద్దలు తీసుకోబోయే చర్యలకు బాధ్యత వహిస్తానని, ఒక వ్యక్తిని జామీనుగా ఇవ్వాలని సూచించారు. దీనికి మేమే ఒప్పులోలేదని తెలిపారు.

ఇది కూడా చదవండి : రష్మిక మతాంతర వివాహంపై నెట్టింట చర్చ.. పెళ్లి చేసిన వ్యక్తి ఏమన్నారంటే

ఈ క్రమంలోనే మేము నిర్వహించే కల్లు దుకాణంలో ఎవరూ కల్లు కొనద్దని, భార్య నిర్వహించే కిరాణా షాపులోనూ వస్తువులు కొనకూడదని రూల్ పెట్టారు. అంతేకాదు ఎవరైనా మా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కలుగజేసుకోవడం, సరుకులు కొనడం వంటివి చేస్తే రూ.50 వేల జరిమానా విధిస్తామని తీర్మాణం చేశారని బాధిత కుంటుంబ పేర్కొంది. అయితే ఈ అవమానం తట్టుకోలేక లోకేశ్వరం పోలీస్ స్టేషన్లో తమ గోడు వినిపించుకున్నామని, మానసికంగా వేధించిన వారిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

అయితే దీనిపై వివరణ ఇచ్చిన ఎస్సై సాయి కుమార్.. గ్రామంలో నరేష్ గౌడ్ అనే వ్యక్తి కుటుంబానికి సంఘ బహిష్కరణ చేసినట్లు శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు వచ్చింది. విచారణ చేపట్టాం ఆ కుటుంబానికి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సంఘ బహిష్కరణ చేసింది నిజమని తేలితే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఇక దీనిపై మాట్లాడిన విడిసి అధ్యక్షుడు రాజేశ్వర్.. నరేష్ గౌడ్ కుటుంబానికి ఎలాంటి సంఘ బహిష్కరణ చేయలేదు. ఆయన కల్లు దుకాణంలో కల్లు సక్రమంగా ఉండడం లేదు. అందుకే గ్రామస్తులు ఆ దుకాణంలో కల్లు కొనడం లేదు. ఆయన కావాలని ఆరోపణలు చేస్తున్నాడు. ఆ కుటుంబానికి సంఘ బహిష్కరణ చేసినట్లు ఎక్కడా ప్రకటించలేదని సంఘ బహిష్కరణ చేసినట్లు ఎలాంటి ఆధారాలు ఉన్నా తాము బాధ్యత వహిస్తామని స్పష్టం చేశారు. కాగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్సై సాయి కుమార్ వెల్లడించారు.

#caste #family #exile #naresh-goud
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి