PM Modi : భారతదేశం అంతులేని శక్తిగా ఎదుగుతోంది-ప్రధాని మోదీ

ఇండియా సూపర్ పవర్‌గా ఎదుగుతోందని చెప్పారు ప్రధాని మోదీ. ఆర్ధికపరమైన అభివృద్ధే కాకుండా దౌత్య పరంగా కూడా పెరుగుదల ఉందని అన్నారు. అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదుగుతున్న భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని చెప్పుకొచ్చారు.

NITI Aayog: నేడు నీతి ఆయోగ్ భేటీ.. పలు రాష్ట్రాలు బాయ్‌ కాట్‌
New Update

India : నరేంద్రమోదీ(Narendra Modi) అండ్ ది అన్‌స్టాపబుల్ రైజ్ ఆఫ్ ఇండియా(The Unstoppable Rise Of India) అనే ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ చాలా విషయాలు పంచుకున్నారు. భారతదేశం ఎదుగుదల, చైనాతో సత్సంబంధాలు లాంటి విషయాలను చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల నుంచి రామమందిరం, పాకిస్తాన్, క్వాడ్ ఇలా చాలా విషయాల గురించి చర్చించారు.

ప్రపంచశక్తిగా భారతదేశం...

ప్రపంచంలో భారతదేశం ఇప్పటికే ముఖ్యమైన దేశంగా ఉంది. ఇప్పుడుమన దేశం మరింత ముందుకు దూసుకువెళుతోంది అంటున్నారు ప్రధాని మోదీ. ఆర్ధికపరంగా, దౌత్యపరంగా, శాస్త్రీయ, సైనిక పరంగా ఇంకా అన్ని రంగాల్లో ప్రపంచదేశాలతో పోటీ పడుతోందని తెలిపారు. చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ సూపర్ పవర్‌గా నిలిచిందని చెప్పారు. దీంతో పాటూ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని... అది కూడా సాధ్యమయితే ఇండియా అత్యంత శక్తివంతంగా తయారవుతుందని అన్నారు. ప్రస్తుతం తమ లక్ష్యం అదేనని వివరించారు.

ప్రజాస్వామ్యం..ఎన్నికలు..

మరికొన్ని రోజుల్లో దేశం మొత్తం మీద ఎన్నికలు(Elections) జరగనున్నాయి. వీటి మీద కూడా మోదీ వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో దేశంలో భారీ ఓటింగ్ శాతం నమోదవుతుందని తెలిపారు. భారత్‌లో ప్రజాస్వామ్యం అన్ని విధాలా రక్షించబడుతోందని..రానున్న రోజుల్లో ప్రజలు మరింత స్వేచ్ఛగా బతుకుతారని చెప్పారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదం దృష్టిలో పెట్టుకునే తాము ముందుకు వెళతామని తెలిపారు. దేవంలో మీడియా స్వేచ్చ తగ్గుతోంది, జర్నలిస్టుల స్వేచ్చ కాలరాస్తున్నారు అనే వార్తలను ప్రధాని మోదీ ఖండించారు. భారతదేశం నుంచి వెళ్ళిపోయిన కొంతమంది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని...వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మోదీ అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యదేశమని కేవలం రాజ్యాంగంలో రాసినందుకే ఆచరించడం లేదని...అది భారతీయుల జన్యువుల్లోనే ఉందని చెప్పుకొచ్చారు. జమ్మూ -కాశ్మీర్‌లో ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా, కొత్త ఆశలతో జీవిస్తున్నారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఫార్ములా 4 రేసింగ్ ఈవెంట్, మిస్ వరల్డ్ మరియు G20 సమావేశాలు వంటి ముఖ్యమైన సమావేశాలను నిర్వహిస్తూ, ప్రపంచ ఈవెంట్‌లకు స్వాగతించే గమ్యస్థానంగా మారిందని అన్నారు.

దేశ అభివృద్ధి...

అంతేకాదు భారతదేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతోందని చెబుతున్నారు ప్రధాని మోదీ. జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవుల లాంటి వాటిని చూస్తే ఈ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. దాంతో పాటూ పర్యావరణ సమస్యలను అధిగమించేందుకు తమ దేశం కృష్టిచేస్తోందని తెలిపారు. భౌతికి మౌలిక సదుపాయాలను మరింత పెంపొందించేందుకు తమ ప్రభుత్వం పాటు పడుతోందని చెప్పారు. దీని కోసం తాము నిబద్ధతతో పని చేస్తున్నామని తెలిపారు.

చైనాతో సత్సంబంధాలు...

భారత్‌తో , చైనాకు సంబంధాలు చాలా ముఖ్యమైనవే కాక ఎంతో కీలకమైనవి కూడా అంటున్నారు ప్రధాని మోదీ. ఇరు దేశాల మధ్య శాంతి, స్నేహం భారత్, చైనాలకే కాక ప్రపంచం మొత్తానికి కూడా చాలా అవసరం అంటూ వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి చర్చించారు. ఇరుదేశాలు ద్వైపాక్షిక పరస్పర చర్చల ద్వారా సరిహద్దు ఉద్రిక్త పరిస్థితులను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. స్థిరమైన, శాంతియుత సంబంధాలు నెలకొనటం భారత్, చైనా రెండు దేశాలకు చాలా అవసరం. రెండు దేశాలు ఆర్ధికంగా ఇప్పుడు బలంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఎంతో లాభదాయకమని చెప్పారు ప్రధాని.

సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణకు మేం రెడీ..

సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరించడానికి భారత్ సిద్ధంగా ఉందని…దాని కోసం చర్చలకు కూడా తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామని తెలిపారు ప్రధాని మోదీ. దీనికి సంబంధించి రెండు దేశాల మధ్య సానుకూల దౌత్య, మిలిటరీ స్థాయి ద్వైపాక్షిక చర్చల జరుగుతాయని ఆశిస్తున్నా. చైనా కూడా దీనికి సానుకూలంగా స్పందించాలని ఆయన కోరుతున్నా అన్నారు.

డిజిటల్ ఇన్నోవేషన్...

ఇండియా డిజిటల్‌గా కూడా ముందుకు దూసుకుపోతోందని ప్రధాని మోదీ చెప్పారు. డిజిటల్ ఆర్ధిక లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని..దీనికి యూపీఐ చేస్తున్న సేవలు అమోఘం అని ప్రశంసించారు. భారతదేశం, అమెరికా ఆర్ధిక సంబంధాల దృష్ట్యా యూపీఐ సేవలకు మరింత సామర్ధ్యాన్ని చేకూరుస్తామని తెలిపారు.

సాధికారికత...

పరిశోధనలు, యువతను శక్తివంతం చేయడం విషయంలో భారతదేశం దృష్టి పెట్టిందని అంటున్నారు మోదీ. పేదరిక నిర్మూలన, సాంఘిక సంక్షేమ పథకాల్లో ప్రభుత్వం చేస్తున్న కృషిని, లక్షలాది మంది జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో ప్రతీ కమ్యూనిటీకి న్యాయం చేకూరేలా పథకాలు పెట్టామని...దీని ద్వారా అందరూ అభివృద్ధి చెందుతారని చెప్పారు. అలాగే ప్రవాసులతో బంధాలను బలోపేతం చేసేందుకు కూడా తాము కృషి చేస్తున్నామని మోదీ తెలిపారు. ప్రధానితో న్యూస్ వీక్ చేసిన ఇంటర్వ్యూలో మొత్తం దేశంలో అన్ని విషయాల గురించి సమగ్రంగా చర్చించారు. భారతదేశ సమగ్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత చేసింది, ఇక మీదట ఏం చేస్తుంది ఇలా అన్ని విషయాలను కూలంకషంగా చర్చించారు. దేశం పట్ల తనకు ఉన్న దృష్టి, సాధికారికతను తెలియజేశారు.

Also Read:Telangana : ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీ రేసులోకి కొత్త పేరు

#india #devolepment #inter-view #pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe