Zaheerabad : భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) మరోసారి ఎస్సీ వర్గీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నిక(Lok Sabha Elections) ల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్న ఆయన.. మంగళవారం జహీరాబాద్ అల్లాదుర్గం వద్ద ఏర్పాటు చేసిన సభకు హాజరై ప్రసంగించారు. ఈ మేరకు మోడీ మాట్లాడుతూ.. బీజేపీ(BJP) ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని అన్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad: ‘రాన్’లో సందడి చేసిన సన్ రైజర్స్ టీమ్.. కిక్కిరిసిపోయిన కొండాపూర్!
మాదిగలకు తప్పకుండా న్యాయం చేస్తాం..
‘ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్(Congress) వ్యతిరేకిస్తోంది. జహీరాబాద్ సాక్షిగా మాదిగలకు తప్పకుండా న్యాయం చేస్తామని మాటిస్తున్నా. 2024లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌కి రికార్డ్ స్థాయిలో ఎంపీ స్థానాలొచ్చాయి. అయిన కూడా ఆ పార్టీ దళితులు, ఓబీసీలకు అన్యాయం చేసింది. లింగాయత్ రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం. ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలం. బంజారా రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాజ్యాంగానికి వ్యతిరేకం’ అంటూ చెప్పుకొచ్చారు. చివరగా మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరగాంధీ రాజ్యాంగాన్ని పదే పదే అవమానించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.