Assam Kaziranga National Park : అసోం(Assam) కిజరంగా నేషనల్ పార్కు(Kaziranga National Park) లో ప్రధాని మోదీ(PM Modi) సరదగా గడిపారు. జీపులోంచి కజిరంగా ప్రకృతి అందాలను చూశారు. ఆ తర్వాత ప్రధాని ఏనుగు స్వారీ చేశారు. ప్రధాని మోదీ జంగిల్ సఫారీని బాగా ఆస్వాదిస్తున్నట్లు ఫొటోలలో స్పష్టంగా చూడవచ్చు.
నేషనల్ పార్క్ భద్రత కోసం మోహరించిన పోలీసులతో కూడా ప్రధాని సమావేశమయ్యారు. ఇక టైగర్ రిజర్వ్(Tiger Reserve) లో ఏనుగు, జీప్ సఫారీలో మోదీ పాల్గొన్నారు. కజిరంగా నేషనల్ పార్క్ అందాలను మోదీ తన కెమెరాలో బంధించారు.
యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్(UNESCO) ప్రకటించిన వరల్డ్ హెరిటేజ్ సైట్‌ను తొలిసారిగా సందర్శించిన మోదీ పార్క్‌లోని 'సెంట్రల్ కొహోరా రేంజ్'లోని మిహిముఖ్ ప్రాంతంలో మొదట ఏనుగుపై సవారీ చేశారు. అదే రేంజ్ లోపల జీప్ రైడ్ చేశారు.
హార్టికల్చర్ డైరెక్టర్ సోనాలి ఘోష్, ఇతర సీనియర్ అటవీ అధికారులు కూడా కజిరంగా నేషనల్ పార్క్‌లో మోదీతో పాటు తిరిగారు.
కజిరంగా నేషనల్ పార్క్‌లో ఏనుగులను నిర్వహించే మహౌట్‌లను మోదీ కలిశారు.
అసోంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని శుక్రవారం సాయంత్రం కజిరంగా చేరుకున్నారు. శనివారం తెల్లవారుజామున నేషనల్ పార్క్‌ను ఆయన విజిట్ చేశారు.
కజిరంగా నేషనల్ పార్క్‌లో సూర్యోదయ సమయంలో ప్రకృతి అందాలను తిలకించారు మోదీ.
తన సఫారీ సమయంలో మోదీ కజిరంగాలోని మహిళా ఫారెస్ట్ గార్డుల బృందం 'వాన్ దుర్గా' సభ్యులను కూడా కలిశారు. నేషనల్ పార్క్‌లోని వన్యప్రాణుల సంరక్షణలో ఈ బృందం కీలక పాత్ర పోషించింది.
Also Read : ఏనుగుపై ప్రధాని రయ్‌రయ్.. మోదీ స్వారీ మాములగా లేదుగా!