దేశం అభివృద్ధి కావాలంటే ఉపాధ్యాయులకు ఏటా రూ.83లక్షలు చెల్లించాలి: నారాయణ మూర్తి

దేశం అభివృద్ధి చెందాలంటే విశ్రాంత ఉపాధ్యాయులకు ఏటా రూ.83 లక్షలు చెల్లించాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అన్నారు. దేశంలో, ప్రపంచవ్యాప్తంగా..STEM(సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌) రంగాల్లో నిష్ణాతులైన 10 వేల మంది రిటైర్డ్ టీచర్లను నియమించాలన్నారు.

దేశం అభివృద్ధి కావాలంటే ఉపాధ్యాయులకు ఏటా రూ.83లక్షలు చెల్లించాలి: నారాయణ మూర్తి
New Update

ఇటీవల ఇన్ఫోసిస్ వ్యవస్థాకుడు నారాయుర్తి.. భారత యువత వారానికి 78 గంటల పాటు పనిచేయాలని చెప్పడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన మరో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం రూ.83 లక్షలు చెల్లించాలని అన్నారు. ఇన్ఫోసిస్ సైన్స్ పౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. ' దేశంలో ఉపాధ్యాయులు, పరిశోధకులను గౌరవించి వాళ్లకు మెరుగైన వేతనాలు అందిచాలి. ఐటీ నిపుణులు, ఉపాధ్యాయులు, పరిశోధకుల సాయం వల్ల దేశం వేగంగా అభివృద్ధి అవుతుంది. ప్రతిదేశంలో కూడా నాలుగు దశలుంటాయి. మొదటి దశలో దేశ పౌరులు ఆవిష్కరణ చేయరు. రెండో దశలో ఇతర దేశాల ఆవిష్కరణలతో ఉత్పత్తులు, సేవలను ప్రారంభిస్తారు. ఇక మూడోదశలో ఒక దేశం..అభివృద్ధి చెందిన ఇతర దేశాల్లాగా ఉన్నత విద్య, పరిశోధనలతో మెరుగైన నాణ్యత, ఉత్పాదకత కోసం ఖర్చులు చేసి దాని ఫలితాలు పొందుతారు.

చివరికి నాలుగో దశలో.. ఏ దేశంపై కూడా ఆధారపడకుండా సొంతగా ఆవిష్కరణలు చేసుకుంటారు. అలాగే ఇతర దేశాల అవసరాలను కూడా తీరుస్తారు. దీనివల్ల దేశం అభివృద్ధి అవుతుంది. ఇందుకోసం ముఖ్యంగా విద్య, పరిశోధనలు అనేవి చాలా అవసరం. దేశంలో కొన్ని ప్రాంతాలు ఇంకా కాలుష్య నిర్వహణ, ట్రాఫిక్ నిర్వహణ, స్వచ్ఛమైన నీటిని అందించడంలో మొదటి దశలోనే ఉన్నాయి. ప్రతి మారుమూల ప్రాంతం నాలుగో దశకు చేరుకోవాలని కోరుకుంటున్నానని' నారాయణ మూర్తి అన్నారు.

Also Read: జమ్మూ కశ్మీర్‌ లో పెను విషాదం..36 మంది దుర్మరణం..!!

అలాగే రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులను జాతీయ విద్యా విధానంలో భాగం చేస్తే.. మంచి ఫలితాలు సాధించవచ్చని మూర్తి తెలిపారు. దేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా.. STEM(సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌) రంగాల్లో నిష్ణాతులైన 10 వేల మంది రిటైర్డ్ టీచర్లను నియమించాలని అన్నారు. వాళ్లతో సుమారు 2500 "ట్రైన్ ది టీచర్" కాలేజీలను ఏర్పాటు చేసి స్థానికంగా ఉండేటటువంటి ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇప్పించాలని అన్నారు. అయితే ఇందుకోసం వారికి ప్రతి ఏడాది లక్ష డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.83 లక్షలు ఖర్చు అవుతాయని తెలిపారు. వీళ్లందరికి ఏటా రూ.8300 కోట్లు అలాగే 20 ఏళ్లకు 1.66 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. త్వరలోనే ఇండియా రూ.415 లక్షల కోట్ల జీడీపీ లక్ష్యంగా ఎదుగుతోందని.. అందుకే ఉపాధ్యాయులకు ఇంత ఖర్చు చేయడం భారత ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారం కాకపోవచ్చని నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా.. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ఇండియా 2020 విధానాన్ని 29 జులై 2020న ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2030 వరకు దేశం సుస్థిరాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

#teachers #narayana-murthy #telugu-news #retired-teachers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి