Nara Lokesh Yuvagalam Padayatra: టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీలో చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవాళ్టి నుంచి పునః ప్రారంభం కానుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం శీలంవారి పాకలు వద్ద నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. మిచౌంగ్ తూఫాన్ కారణంగా 216వ రోజున బ్రేక్ పడింది. ఇప్పటి వరకు 2,974 కిలోమీటర్లు నడిచారు లోకేష్ (Nara Lokesh). శుక్రవారం రాత్రి రాజమండ్రి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో పిఠాపురం నియోజకవర్గం క్యాంప్‌కి చేరుకున్నారు లోకేష్. ఇవాళ పాకలు క్యాంప్ నుంచి 217వ రోజు యువగళం పాదయాత్రను ప్రారంభిస్తారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి తుని అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర షెడ్యూల్ వివరాలు..(ఈరోజు)
ఉదయం
8.00 – శీలంవారిపాకలు జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.30 – కోనపాపపేటలో మత్స్యకారులతో సమావేశం.
11.00 – శ్రీరాంపురంలో ఎస్సీలతో సమావేశం.
11.05 – పాదయాత్ర తుని అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
12.05 – జిఎంఆర్ హాస్పటల్ వద్ద భోజన విరామం.
3.00 – కాకినాడ సెజ్ బాధిత రైతులతో ముఖాముఖి సమావేశం.
సాయంత్రం
4.00 – జిఎంఆర్ హాస్పటల్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.30 – బుచ్చయ్యపేట సెంటర్ లో గ్రామస్తులతో సమావేశం.
6.00 – వాకదారిపేట సెంటర్ లో మాటామంతీ.
6.45 – పెరుమాళ్లపురం దివీస్ ఫ్యాక్టరీ వద్ద స్థానికులతో సమావేశం.
7.00 – ఒంటిమామిడి కొత్తపాకల వద్ద ఆక్వా రైతులతో సమావేశం.
7.45 – ఒంటిమామిడి వద్ద విడిది కేంద్రంలో బస.
Also Read:
నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణం
పచ్చి టమాటా తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఎన్ని పోషకాలుంటాయో తెలుసా?