నేడు CID ముందుకు లోకేశ్...సర్వత్రా ఉత్కంఠ ..!!

నేడు సీఐడీ విచారణకు నారా లోకేశ్ హాజరవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లాగానే లోకేశ్ ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

చంద్రబాబు పేరుతో లెటర్..లోకేష్ సంచలన వ్యాఖ్యలు.!
New Update

నేడు సీఐడీ విచారణకు నారా లోకేశ్ హాజరవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లాగానే లోకేశ్ ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఏపీ స్కిల్ డెవలప్ మెట్ స్కాం కేసులో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబునాయుడిని పోలీసులు అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే. నేడు ఆయన తనయుడు మాజీ మంత్రి లోకేశ్ ను సీఐడీ విచారించనుంది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ లోకేశ్ సీఐడీ విచారణకు హాజరవుతుండటంతో ఏం జరుగుతుందోనని అటు రాజకీయ, ఇటు టీడీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: సీఐడీ ఆఫీస్ కు నారా లోకేష్.. ఆయనను అడగనున్న పది ప్రశ్నలివే?

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో స్కాం జరిగిందని..అందులో ఆనాటి మంత్రి లోకేశ్ పాత్ర ఉందని సీఐడీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తమ కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థతోపాటు ఇంకొంతమందికి లాభం చేకూర్చేలా ఐఆర్ఆర్ అలైన్ మెంట్ మార్చినట్లు సీఐడీ అంటోంది. ఈ వ్యవహారంపై విచారణకు హాజరుకావాలంటూ లోకేశ్, నారాయణలకు నోటీసులు జారీ చేసింది.

ఇక చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేశ్ ఢిల్లీలోనే ఎక్కువగా గడిపిన సంగతి తెలిసిందే. నేడు సీఐడీ ముందుకు హాజరుకావాల్సి ఉండటంతో సోమవారం అర్థరాత్రి ప్రత్యేక విమానంలో ఏపీకి వచ్చారు. గన్నవారం ఎయిర్ పోర్టులో ఆయనకు టీడీపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లికి వెళ్లారు లోకేశ్. ఇవాళ 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ లోకేష్ ను విచారించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: మానసిక ఆరోగ్యం బాగుండాలంటే.. ఈ 6 పనులు చేయండి..!!

#iir-scam #cid #nara-lokesh #amaravati
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe