Also Read: కొడాలి నాని నమ్మిన దోస్త్ ను మోసం చేసిన దొంగ: కొలికపూడి
శాంతిపురం మండల కేంద్రంలో మహిళతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగించారు నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari). స్త్రీలు సమాజంలో ముందుకు వెళ్ళడానికి ధైర్యం ఇచ్చింది ఎన్టీయార్ (NTR) అని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది ఎన్టీయార్ అని కొనియాడారు. మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 53 శాతం రిజర్వేషన్ ను చంద్రబాబు (Chandrababu) తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని డ్వాక్రా గ్రూపులను (AP Dwakra Groups) చంద్రబాబు తీసుకొచ్చారని..పసుపు కుంకుమ పథకం కింద మహిళలకు 10 వేల కోట్లను చంద్రబాబు అందించారని గుర్తు చేశారు. తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ ను తీసుకొచ్చింది చంద్రబాబని పేర్కొన్నారు.
Also Read: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్
ఇంట్లోని ప్రతి బిడ్డకు రూ. 15 వేలు, ఆర్టీసి బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus) కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ వుండేదని.. కానీ, దిశా చట్టం పథకం లాగే ఉండిపోయిందని అన్నారు. గంజాయిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో 2019 - 21 వరకు 30,196 మహిళలు మిస్సింగ్ అయ్యారని రాజ్యసభలో చెప్పారని అన్నారు.