Bhuvaneshwari: చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు.. ఈసారి నన్ను గెలిపిస్తారా..? భువనేశ్వరి కామెంట్స్ వైరల్..! కుప్పంలో నాకు మద్దతిస్తారా..? చంద్రబాబు గారికి మద్దతిస్తారా..? అంటూ సభికులను సరదాగా ప్రశ్నించారు భువనేశ్వరి. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు.. ఈసారి నన్ను గెలిపిస్తారా..? అంటూ చమత్కరించారు. దీంతో, కార్యక్రమానికి వచ్చిన వాళ్లందరూ ఇద్దరూ కావాలంటూ జవాబిచ్చారు. By Jyoshna Sappogula 21 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Nara Bhuvaneshwari Comments On Chandrababu: కుప్పంలో (Kuppam) నాకు మద్దతిస్తారా..? చంద్రబాబుకి మద్దతిస్తారా..? అంటూ నిజం గెలవాలి కార్యక్రమాల్లో పాల్గొన్న సభికులను సరదాగా ప్రశ్నించారు నారా భువనేశ్వరి. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు.. ఈసారి నన్ను గెలిపిస్తారా..? అంటూ భువనేశ్వరి చమత్కరించారు. దీంతో కార్యక్రమానికి వచ్చిన వాళ్లు ఇద్దరూ కావాలంటూ హోరెత్తించారు. అలా కుదరదని.. ఎవరో ఒకరి పేరే చెప్పాలని అన్నారు భువనేశ్వరి. అయితే, తాను సరదాగా అన్నారని వివరించారు. ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదని.. అప్పడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలని అన్నారు. ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ స్పష్టం చేశారు. Also Read: కొడాలి నాని నమ్మిన దోస్త్ ను మోసం చేసిన దొంగ: కొలికపూడి శాంతిపురం మండల కేంద్రంలో మహిళతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగించారు నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari). స్త్రీలు సమాజంలో ముందుకు వెళ్ళడానికి ధైర్యం ఇచ్చింది ఎన్టీయార్ (NTR) అని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది ఎన్టీయార్ అని కొనియాడారు. మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 53 శాతం రిజర్వేషన్ ను చంద్రబాబు (Chandrababu) తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని డ్వాక్రా గ్రూపులను (AP Dwakra Groups) చంద్రబాబు తీసుకొచ్చారని..పసుపు కుంకుమ పథకం కింద మహిళలకు 10 వేల కోట్లను చంద్రబాబు అందించారని గుర్తు చేశారు. తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ ను తీసుకొచ్చింది చంద్రబాబని పేర్కొన్నారు. Also Read: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ ఇంట్లోని ప్రతి బిడ్డకు రూ. 15 వేలు, ఆర్టీసి బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus) కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ వుండేదని.. కానీ, దిశా చట్టం పథకం లాగే ఉండిపోయిందని అన్నారు. గంజాయిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో 2019 - 21 వరకు 30,196 మహిళలు మిస్సింగ్ అయ్యారని రాజ్యసభలో చెప్పారని అన్నారు. #andhra-pradesh #chandrababu #kuppam #bhuvaneswari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి