/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-03T152237.413.jpg)
Nandamuri Mokshagna Debut Movie: బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత మూడేళ్ళుగా మోక్షజ్ఞ ఎంట్రీ పై ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటిదాకా మోక్షు ఎంట్రీపై అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో మునిగిపోయారు. ఇక ఎట్టకేలకు మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ వచ్చేసింది. పాన్ ఇండియా డైరెక్టర్ బాలయ్య (Balakrishna) తనయుడిని వెండితెరకు పరిచయం చేయబోయితున్నాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే...
'హనుమాన్' డైరెక్టర్ తో...
మోక్షజ్ఞ కోసం ఇప్పటికే పలువురు యంగ్ డైరెక్టర్స్ కథలు సిద్ధం చేశారట. వారిలో కొందరు ఇప్పటికే బాలయ్యకు కథలు కూడా వినిపించి.. గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. కానీ బాలయ్య మాత్రం తన వారసుడి డెబ్యూ బాధ్యతను 'హనుమాన్' మూవీ ఫేం ప్రశాంత్ వర్మకు (Prashanth Varma) అప్పగించినట్లు సమాచారం. మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ ఓ మంచి కథను సిద్ధం చేశాడట.
Also Read : అల్లు అర్జున్ Vs పవన్ కళ్యాణ్.. ‘పుష్ప 2’ కు పోటీగా వీరమల్లు?
మోక్షజ్ఞ బర్త్ డే కి...
మోక్షజ్ఞ బర్త్‌డే సెప్టెంబర్ 6 న సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇక మోక్షజ్ఞ తన పాత్ర కోసం భారీ కసరత్తు చేస్తున్నాడు. ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకున్నాడు. లుక్స్ పరంగా గతంలో కొంచెం బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ..ఇటీవల బాగా సన్నబడ్డారు. తాజాగా స్టైలిక్ లుక్‌తో ఫోటో షూట్ నిర్వహించి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని రాసుకొచ్చాడు. కాగా మోక్షజ్ఞ తొలి సినిమాకు బాలయ్య నిర్మాతగా వ్యవహరించబోన్నారని సమాచారం.
వస్తున్నా......♥️👍
Need All Your Blessings 🙏 #DebutOfMokshagnaTeja#NBK#balayya#NandamuriBalakrishnapic.twitter.com/Fbe8qr2ECV— Nandamuri Mokshagna Teja (@Mokshagna_Offl) July 1, 2024
Follow Us