Nandamuri Balakrishna: చంద్రబాబు అరెస్ట్ తరవాత ఏపీ రాజకీయాల్లో హార్ట్ టాపిక్ గా మారిన నందమూరి బాలకృష్ణ(Nandmuri Balakrishna) ఇప్పుడు ఏపీకి ఎందుకు రావడం లేదు.. టిడిపిని(TDP) భుజాలపై వేసుకుని నడిపిస్తారనుకుని భావించిన బాలయ్య.. ఏపీలో టీడీపీని నడిపించడం కష్టం అనుకున్నారా? లేదా ఇక్కడ టీడీపీ నేతలు ఆయన్ని రాకుండా అడ్డుకున్నారా? టిడిపి ఇబ్బందుల్లో ఉన్న ఏపీలో కాకుండా తెలంగాణలో ప్రెస్‌మీట్‌లు పెట్టడానికి కారణం ఏంటి? బాలయ్యను వద్దన్నారా? ఆయనే వద్దనుకున్నారా? అసలేం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్నికల వేళ చంద్రబాబు అరెస్ట్ ఆ పార్టీకి తీవ్ర ఇబ్బందులు తెచ్చి పట్టింది. చంద్రబాబు అరెస్టుతో ఒక్కసారిగా షాక్ తిన్న టిడిపి నేతలకు.. పార్టీని ముందుకు నడిపించే నేతలు ఎవరని హైరానా పడిపోయారు. అప్పుడే సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. చంద్రబాబు అరెస్టు తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయంలో వరుస మీటింగ్ లు పెట్టారు బాలకృష్ణ. అదే దూకుడుతో వరుసగా జిల్లా పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. అంతేకాదు రాజమండ్రి వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ అవ్వడం.. రాజమండ్రిలో ఉంటూ కొన్ని రోజులు పార్టీ యాక్టివిటీని కూడా చూసుకున్నారు. ఇక తర్వాత మొదలైన అసెంబ్లీ సమావేశంలోనూ బాలకృష్ణ సెంటర్ అఫ్ అట్రాక్షన్‌గా మారారు. టిడిపి సభకు హాజరైన రెండు రోజులు బాలకృష్ణ చుట్టే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి అంటే అతిశయోక్తి కాదు. ఇక ఆ తర్వాత బాలకృష్ణ పెద్దగా యాక్టివ్‌గా లేకపోవడం, హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగాయి. మధ్యలో గత నెల 29న నంద్యాలలో జరిగిన పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశానికి మాత్రమే హాజరయ్యారు. అప్పటినుంచి పూర్తిగా ఇనాక్టివ్ గా ఉంటున్న బాలయ్య.. ఏపీకి ఎందుకు రావడం లేదు అనే చర్చ ఆ పార్టీలోనే జరుగుతుంది. బాలకృష్ణను టిడిపిలో ఎవరైనా అడ్డుకుంటున్నారా లేక ఆయనే దూరంగా జరుగుతున్నారా? అనే చర్చ నడుస్తుంది.
వాస్తవానికి చంద్రబాబు అరెస్టు తరువాత బాలకృష్ణ చాలా ఎగ్రసీవ్ గా టిడిపి వ్యవహారాలు చూసుకున్నారు. బాలయ్యతో పాటు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా రాజమండ్రిలో ఉంటూ పార్టీ ఆదేశానుసారం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే మొదట్లో చాలా హడావిడి చేసిన బాలకృష్ణ.. ఇప్పుడు ఎందుకు ఏపీకి రావడం లేదని చర్చ మొదలైంది. ఒకవైపు బ్రాహ్మణి, భువనేశ్వరి రాజమండ్రి లోనే ఉంటూ టిడిపిని యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు. కానీ బాలకృష్ణ మాత్రం హైదరాబాద్ వెళ్లిపోవడంపై ఆ పార్టీ నేతలే పెదవిరుస్తున్నారు. పార్టీ నడిపించే అవకాశం వచ్చినప్పుడు బాలకృష్ణ ఎందుకు వదులుకుంటున్నారు అనే విధంగా కొంతమంది పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు వచ్చే వరకైనా పార్టీని నడిపించే బాధ్యత తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే బాలకృష్ణ పార్టీ నేతలతో సమావేశాలు పెట్టడం, చంద్రబాబు చైర్‌లో కూర్చుని పార్టీకి సంబంధించిన నేతలతో మాట్లాడటంపై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చె్న్నాయుడు అలిగారనే టాక్ ఆ మధ్య నడిచింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉండగా బాలకృష్ణ ఏ విధంగా చంద్రబాబు చైర్‌లో కూర్చుని పార్టీ నేతలతో సమావేశాలు పెడతారనే ప్రచారం అప్పట్లో నడిచింది. అంతేకాదు చంద్రబాబు ములాఖత్ విషయంలోనూ అచ్చెన్నాయుడుని పక్కన పెట్టారని, బాలకృష్ణ, భువనేశ్వరి, బ్రాహ్మణి మమాత్రమే చంద్రబాబుతో ములాఖత్ అయ్యే అవకాశంక ల్పించారని టాక్ ఉంది. ఈ విధంగా అచ్చెన్నాడుడిని పక్కన పెట్టారని పార్టీలో జోరుగా చర్చ సాగింది. టిడిపిలో బాలకృష్ణ యాక్టీవ్ అవ్వడం కొంతమందికి ఇష్టం లేదని , దాని కారణంగానే బాలకృష్ణ పార్టీకి కొంచెం దూరంగా ఉంటున్నారని, చంద్రబాబు అరెస్టు సమయంలో ఉన్న ఎంత యాక్టివ్‌గా బాలకృష్ణ ఉండకపోవడానికి కారణం అదే అని చెప్పుకుంటున్నారు.
ఇక మరోవైపు ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సీజన్ స్టార్ట్ కావడంతో బాలకృష్ణను ఇక్కడికి పంపారు అనే ప్రచారం కూడా నడుస్తుంది. తెలంగాణలో టిడిపి పోటీ చేయడంతో పాటు ఎక్కువ స్థానాల్లో బరిలో ఉండాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే బాలకృష్ణను అక్కడ యాక్టివ్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ అక్కడి పార్టీ నేతలతో వరుస సమావేశాలు పెట్టడం, ప్రెస్‌మీట్‌లు పెట్టడం చేస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీలో టీడీపీ బాధ్యతలు చూసుకోవడానికి అచ్చెన్నాయుడుతో పాటు నారా బ్రాహ్మణి, భువనేశ్వరి కూడా అందుబాటులో ఉండటంతో. బాలయ్య తెలంగాణపై ఫోకస్ పెంచాలని చంద్రబాబు సూచించారట. అందుకే బాలకృష్ణ తెలంగాణలో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు సమాచారం.
అయితే, ఏపీలో కూడా బాలకృష్ణ అవసరం టిడిపికి ఉందని, అటు సినిమా ఇటు ఎన్టీఆర్ వారసుడిగా జిల్లా కొంత చరిష్మా ఉంటుందని.. ఆ విధంగా బాలకృష్ణను ఏపీ లో కూడా ఉపయోగించుకోవడం ద్వారా రాజకీయంగా టిడిపికి ఉపయోగకరంగా ఉంటుందని మాటలు కూడా వినిపిస్తున్నాయి. బాలకృష్ణ ఉన్న వారం పది రోజులు, టిడిపి క్యాడర్ లో జోష్ వచ్చిందని, బాలకృష్ణ ను ఏపీలో కూడా తిప్పగలిగితే రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read:
ఆ బాధ నీకెందుకయ్యా రేవంతు.. ఎంపీ అరవింద్ మాస్ కామెంట్స్..
కాంగ్రెస్ సంచలన హామీ..పెళ్లి సమయంలో ఆడపిల్లలకు తులం బంగారం..!