Drought in Namibia: ఆఫ్రికా దేశమైన నమీబియా కరువుతో అల్లల్లాడుతోంది. గత 100 ఏళ్ళల్లో ఎప్పుడూ లేనంతగా అక్కడ ప్రజలు ఆకలితో మటమటలాడుతున్నారు. ఈ దేశ ప్రభుత్వం దగ్గర కూడా పెద్దగా డబ్బులు లేకపోవడంతో ప్రజల ఆకలిని తీర్చలేకపోతోంది. దీంతో అడవిలో 700 జంతువులను చంపి..ఆ మాంసం ప్రజలకు పంచాలని నిర్ణయించింది. ఇందులో 83 ఏనుగులో పాటూ జీబ్రాలు, నీటి గుర్రాలు లాంటివి కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆదేశ పర్యావరణ, అటవీశాఖ మంత్రులే తెలిపారు.ప్రభుత్వం వధించాలని డిసైడ్ అయిన అడవి జంతువుల జాబితాలో 83 ఏనుగులు, 30 నీటి గుర్రాలు (హిప్పోలు), 60 అడవి దున్నలు, 50 ఇంఫాలాలు, 100 బ్లూవైల్డ్ బీస్ట్‌లు, 300 జీబ్రాలు ఉన్నాయి. ఆఫ్రికాలోని అడవుల్లో వీటి సంఖ్య అధికంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.
దీని కోసం నిపుణులైన వేటగాళ్ళను నియమించనున్నారు. నైరుతి ఆఫ్రికాలోని కరువు ప్రాంతాల్లో ఈ జంతువులను పంచనున్నారు. ఈ ఏడాది కరవు తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. నమీబియాలో జాతీయ అత్యయిక పరిస్థితిని విధించారు. దాదాపు 14,00,000 మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సంఖ్య మొత్తం దేశ జనాభాలో సగానికి సమానంగా ఉంది. ఆఫ్రికాలో నీటి కొరత కూడా అధికంగానే ఉంది. దీనివలన ఆయా జంతువులు జనావాసాల మీద పడి ఇబ్బందులు కూడా పెడుతున్నాయి.
ఆఫ్రికా ఖండంలోని దక్షిణ ప్రాంతంలో ఏనుగుల సంఖ్య 2,00,000కుపైగా ఉంది. ఈ ప్రాణులు కరవు బారినపడి నీరు దొరక్క గతేడాది భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి. బోట్సువానాలో 1,30,000 ఏనుగులు ఉన్నాయి. ఇక్కడ ఏనుగుల వేటకు అనుమతి ఉంది.
Also Read: Andhra Pradesh: కడపలో క్యాంపు రాజకీయాలు..నేతలను కాపాడుకునేందుకు వైసీపీ పాట్లు