Naga Chaitanya: బుజ్జితల్లి.. వచ్చేస్తున్నా కదే.. చైతన్య, సాయి పల్లవి రీల్ వైరల్!

నాగచైతన్య లేటెస్ట్ మూవీ తండేల్. ఇటీవలే రిలీజైన ఈ సినిమా గ్లిమ్ప్స్ కు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్లిమ్ప్స్ లోని బుజ్జితల్లి.. వచ్చేస్తున్నా కదే.. డైలాగ్ ఫుల్ ట్రెండ్ అవుతుంది. తాజాగా నాగచైతన్య, సాయి పల్లవి కూడా ఈ డైలాగ్ తో రీల్ చేసి పోస్ట్ చేశారు.

New Update
Naga Chaitanya: బుజ్జితల్లి.. వచ్చేస్తున్నా కదే.. చైతన్య, సాయి పల్లవి రీల్ వైరల్!

Naga Chaitanya: చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం తండేల్. గీత ఆర్ట్స్ పతాకం పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ కు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా గ్లింప్స్ లోని బుజ్జితల్లి.. వచ్చేస్తున్నా కదే.. కాస్త నవ్వే.. అనే ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఈ డైలాగ్ తో నెటిజన్లు రీల్స్, వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Also Read: Guntur Kaaram: ఓటీటీలో గుంటూరు కారం ఘాటు.. టాప్ 1 ట్రెండింగ్ గా రికార్డు

సాయి పల్లవి, నాగ చైతన్య రీల్

ఇక తాజాగా అభిమానుల కోసం నాగచైతన్య, సాయి పల్లవి కూడా ఈ డైలాగ్ తో రీల్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. "తండేల్ మూవీ గ్లింప్స్ రెస్పాన్స్ ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. సాయి పల్లవికి సంబంధించిన డైలాగ్ పై మీరందరు రీల్స్ చేయడం ఎంతో సంతోషాన్నిస్తుంది. అభిమానుల కోసం.. మేము (నేను , సాయి పల్లవి) కూడా రీల్ చేయాలనుకున్నాము. తండేల్ టీమ్ నుంచి అందరికీ హ్యాపీ వాలెంటైన్ డే' అంటూ రీల్ చేసిన వీడియోను షేర్ చేశారు నాగ చైతన్య". ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో లవ్ స్టోరీతో మెప్పించిన ఈ జంట మరో సారి తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో ఈ మూవీ పై ఆసక్తి మరింత పెరిగింది.

Naga Chaitanya: 

Also Read: OTT Trending Movies: ఓటీటీలో టాప్ 3 ట్రేండింగ్ మూవీస్.. చివరిలో స్థానంలో ఆ సినిమానే..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు