Nadendla Manohar: ఉపాధ్యాయుల బదిలీల్లో కోట్ల రూపాయల కుంభకోణం.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు

ఉపాధ్యాయుల బదిలీల్లో కోట్ల రూపాయల స్కామ్‌ జరిగితే.. డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని నాదెండ్ల మనోహార్‌ ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏసీబీ అధికారులు..ఎన్ని కేసులు వచ్చాయో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుంభకోణాలపై చర్యలు తీసుకుంటామని నాదెండ్ల తెలిపారు.

Nadendla Manohar: ఉపాధ్యాయుల బదిలీల్లో కోట్ల రూపాయల కుంభకోణం.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు
New Update

Nadendla Manohar: ఏపీలో జరుగుతున్న అవినీతిపై జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎన్నికల ప్రచారంలో 130 సార్లు బటన్ నొక్కినా ఒక్క రూపాయి అవినీతి జరగలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. రోజు మీడియాలో వస్తున్న అవినీతి వార్తలకు సమాధానం చెప్పాలని జగన్‌ ప్రభుత్వానికి ఆయన సవాల్‌ చేశారు. అవినీతి నిరోధక శాఖలో టోల్ ఫ్రీ నెంబర్ 14400కు.. 8,03,612 ఫిర్యాదులు వచ్చాయన్నారు. 2,16,803 ఫిర్యాదులు మంత్రులు, పేషీలపై వచ్చాయని తెలిపారు. 4,39,679 ఎమ్మెల్యే లపై వచ్చిన అవినీతి ఫిర్యాదులు వస్తే ఏం చర్యలు తీసుకున్నారో..?  చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

బదిలీల్లో కోట్ల రూపాయల కుంభ కోణం:

ఏటా ఫిర్యాదులపై మీడియాకు చెప్పే అధికారులు.. గత కొంతకాలంగా వివరాలు ఎందుకు చెప్పడం లేదని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సీఎం సమీక్ష సమావేశంలో ఏసీబీ డీజీ ఎవరు? అనే అడిగే స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయుల బదిలీల్లో కోట్ల రూపాయల కుంభ కోణం జరిగితే.. డీజీపీ వీటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఏసీబీ అధికారులు.. ఎన్ని కేసులు వచ్చాయో వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అధికారంలోకి రాగానే కుంభ కోనాలపై చర్యలు:

ఇంత అవినీతి జరిగితే ప్రజలకు అబద్ధాలు చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. కొంత మంది చేతుల్లోనే పవర్స్ ఉన్నాయన్నారు. ఈసీ దీనిపై దృష్టి సారించాలని నాదెండ్ల మనోహార్ కోరారు. పవన్ కళ్యాణ్ ఈనెల 30 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. వచ్చే నెల 10 వరకు మొదటి విడతలో నిర్వహించే ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. తెనాలి, నెల్లిమర్ల, అనకాపల్లి, రాజోలు, రాజానగరంలో ఎన్నికల ప్రచారం ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుంభకోణాలపై చర్యలు తీసుకుంటామని నాదెండ్ల మనోహార్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి: ఊర్లో తిరగనివ్వం.. కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం!

#ap-politcs #amaravathi #janasena-leader-nadendla-manohar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe