Naa saami ranga behind scenes : నా సామిరంగా కథ పట్టుకుని దర్శకుల వేటలో నాగార్జున నాగార్జున నా సామిరంగా అంటూ జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాడు. ఇప్పటికే రిలీజయిన ప్రమోషనల్ కంటెంట్ అదిరిపోయింది. కొరియోగ్రఫర్ విజయ్ బిన్నీని దర్సకుడిగా పరిచయం చేసిన నాగార్జున ఈ సినిమా కథ నుంచి బిజినెస్ వరకు అన్నీ తానే అయి సపోర్ట్ చేయడం విశేషం. By Nedunuri Srinivas 08 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Naa saami ranga: కింగ్ నాగార్జున (Nagarjuna )ఆరుపదుల వయసులోనూ యమా జోరు మీదున్నారు. కథల ఎంపికలో యంగ్ హీరోలకు ధీటుగా ఉండటం విశేషం. ఈ క్రమంలో నా సామిరంగా చిత్ర కథ వెనుక చాలా పెద్ద కథే నదించింది. నిజానికి నా సామిరంగా మూవీ మళయాళ సూపర్ హిట్ పోరింజడు మరియం జోష్ సినిమా ఆధారంగా తెరకెక్కించిన విషయం కాస్త లేట్ గా వెలుగులోకి వచ్చింది.ఈ మూవీ రీమేక్ రైట్స్ నాగార్జున ఎప్పుడో కొనుక్కున్నారు. అయితే దర్శకుడి వేటలో పడిన నాగార్జున ఎట్టకేలకు కొరియోగ్రాఫర్(Vijay Binni)విజయ్ బిన్నీని ఎంపిక చేశారు. ఒరిజినల్ వెర్షన్ ను దర్శకుడు విజయ్ బిన్నీ తన స్టైల్ లో తెరకెక్కించారు. ముగ్గురు హీరోల మల్టీస్టారర్ ఈ మూవీలో నాగార్జున సలహా మేరకు (Allari Naresh)అల్లరి నరేష్ ,(Rajtharun) రాజ్ తరుణ్ లను ఎంపిక చేయడం జరిగింది.ఈ సినిమా 90 రోజుల్లో ఫినిష్ అవడానికి నాగార్జున చేసిన సపోర్ట్, డైరెక్టర్ విజయ్ వర్క్ ప్లానింగ్ బాగా ఉపయోగపడ్డాయట.ఒక రకంగా చెప్పాలంటే..ముగ్గురు హీరోల మల్టీ స్టారర్ సినిమా నా సామిరంగా కావడంతో ఈ సంక్రాంతి అసలైన వినోదాల విందును ఖచ్చితంగా అందిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ... స్వతహాగా కొరియోగ్రాఫర్ అయిన ఈ చిత్ర దర్శకుడు బిన్నీ నాలుగు పాటలు కోరియోగ్రఫీ చేయడం జరిగింది. ఈ సినిమా కోసం నాగార్జున చాలా కష్టపడ్డారట. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్ళిన నా సామిరంగా మూవీ 90రోజుల్లో షూటింగ్ పూర్తిచేసుకోవడంలో నాగ్ సపోర్ట్ ఎంతైనా ఉంది. అందుకే ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయి నాగ చాలా హార్డ్ వర్క్ చేసారు. ALSO READ :Guntur kaaram trailer:రౌడి రమణ సినిమా స్కోపు .. 70MM..మిర్చీ యార్డులో చెలరేగిపోయన మహేష్ సోగ్గాడే చిన్నినాయనా,బంగార్రాజు చిత్రాల సంక్రాంతి సెంటిమెంట్ నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ కింగ్ నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ చాలా ఉంది, గతంలో సోగ్గాడే చిన్నినాయనా , బంగార్రాజు చిత్రాలు సంక్రాంతి పండగకే రిలీజయి హిట్ కొట్టడంతో నా సామిరంగా సైతం ఆ రేంజ్ హిట్ అందుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయని ఆ సెంటిమెంట్ తో ఈ సీజన్ వదిలిపెట్టలేదు. ఇప్పటికీ రిలీజయిన ప్రమోషనల్ కంటెంట్ కు అల్టిమేట్ రెస్పాన్స్ రావడతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కథ నుంచి బిజినెస్ వరకు కింగ్ సపోర్ట్ ఇక.. నాగార్జున ఎంతో కాన్ఫిడెంట్ గా మలయాళం నుంచి కొన్న రైట్స్ కాబట్టి తెలుగు సినిమా బిజినెస్ లో పూర్తి ఇన్వాల్మేంట్ తో రంగంలోకి దిగి నా సామిరంగ ఓటీటీ రైట్స్ టాప్ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో డీల్ కుదిర్చినట్లు తెలుస్తోంది. ఇక.. . శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా నాగార్జున పూర్తి సపోర్ట్ చేసారని సమాచారం. ఇక. సంక్రాంతికి స్టార్ హీరోల చిత్రాల రిలీజ్ ఉండడంతో ఎక్కడా తగ్గకుండా నాగార్జునే థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసి తన స్వంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా మూవీని పంపిణీ చేయడం విశేషం.కథ నుంచి సినిమా రిలీజ్ వరకు అన్నీ తానే అయి ముందుకు నడిపించిన నాగార్జునకు నా సామిరంగా విజయంపై మొదటి నుంచి చాలా నమ్మకంతో ఉన్నారు. ALSO READ :KING NAGARJUNA:లాయర్ పాత్రలో అలరించనున్న నాగార్జున. కొత్త సినిమా అప్డేట్ #tollywood #nagarjuna #allari-naresh #rajtarun #vijaybinny #sankaranthi-release #naa-saamiranga-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి