Sunita : ఢిల్లీ(Delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) లిక్కర్ స్కామ్ కేసు(Liquor Scam Case) కు సంబంధించి మనీలాండరింగ్ కేసు(Money Laundering Case) లో అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తన అరెస్టును సవాలు చేస్తూ ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య సునీత కేజ్రీవాల్ ఓ కీలక ప్రకటన చేశారు. లిక్కర్ పాలసీ స్కామ్‌లో నిజనిజాలు తన భర్త మార్చి 28 (గురువారం) కోర్టులో బయటపెట్టనున్నారని తెలిపారు. ఇందుకు సంబంంధించి ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
Also Read : కవితకు ఖైదీ నంబర్ 666.. డల్‌గా మొదటిరోజు
' నా భర్తను అరెస్టు చేసి ఈడీ(ED) కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయనకు ఆరోగ్యం సరిగా లేదు. డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఆయన ఈడీ కస్టడీలో ఉండి కూడా ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచే రాష్ట్రంలో ఉన్న నీటి సమస్యను నివారించాలని రెండ్రోజుల క్రితమే మంత్రి ఆథిశీకి లేఖ పంపారు. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమస్యగా చేస్తోంది. ఢిల్లీని నాశనం చేయాలని వారు(కేంద్రం) కోరుకుంటున్నారు. ఈ పరిణామాలతో కేజ్రీవాల్ ఆందోళనకు గురవుతున్నారని' సునీత వ్యాఖ్యానించారు.
' లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు సంస్థ ఇప్పటిదాకా 250కి పైగా సోదాలు చేసింది. ఎందులో కూడా వాళ్లకి ఏమి దొరకలేదు. ఈ లిక్కర్ కేసుకు సంబంధించి గురువారం కోర్టులో అన్ని బయటపెడతానని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. లిక్కర్ స్కామ్ డబ్బుల ఎక్కడుందో ఆయన తెలియజేస్తారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఇస్తారని' సునీత పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్టయిన సంగతి తెలిసిందే. మంగళవారం కోర్టు ఆదేశాల తర్వాత ఈడీ అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు.
Also Read : ఎన్నికల తర్వాత దేశం ఎదుర్కోబోయే అతిపెద్ద సవాలు అదే: మాజీ ఆర్బీఐ గవర్నర్