/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/anand-mahindra-jpg.webp)
Anand Mahindra Tweet on Double-deckers: ఈ మధ్య కాలంలో డబుల్ డెక్కర్ బస్సులు గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇటీవలే డబుల్ డెక్కర్ బస్సులు ప్రవేశపెట్టగా.. తాజాగా తిరుపతిలో ఈ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే డబుల్ డెక్కర్ బస్సు అంటే ముందుగా గుర్తుకొచ్చేది ముంబయి. 1937వ సంవత్సరంలో ముంబయి రోడ్లపైకి ఈ బస్సులు వచ్చాయి. అప్పటి నుంచి ఈ బస్సులు ముంబై (Mumbai) వాసులకు ఎంతగానో ఉపయోగపడుతూ వచ్చాయి. ముంబయి బృహన్ ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్ పోర్ట్ (BEST) రెడ్ డబుల్ డెక్కర్ బస్సుల నిర్వహణ చూసుకుంటోంది. అయితే క్రమేణా ఈ బస్సులు సంఖ్య వాడకం తగ్గుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం వీటి వాడకాన్ని నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 1990లలో 900కు పైగా బస్సులు తిరుగుతూ ఉండేవి. ప్రస్తుతం మూడు ఓపెన్ డబుల్ డెక్కర్ బస్సులతో సహా ఏడు ఏసీ డబుల్ డెక్కర్ బస్సులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఏసీ బస్సులను నిలిపివేయగా.. అక్టోబర్ 5 నుంచి ఓపెన్ బస్సులు కూడా నిలిపివేయనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: కోవిడ్ కన్నా నిపా వైరస్ డేంజరెస్-ఐసీఎంఆర్
డీజిల్ ధరలు ఎక్కువ కావడంతోనే ఈ బస్సులను నిలిపివేసినట్లు పేర్కొ్న్నారు. అంతేకాకుండా డీజిల్‌తో నడిచే బస్సుల కాల వ్యవధి కూడా 15 సంవత్సరాలు మాత్రమేనని.. ఇప్పుడు వీటి కాల వ్యవధి ముగిస్తున్నందునే నిలిపివేశామన్నారు. అయితే త్వరలోనే వీటి స్ధానంలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను (Electric Double decker Bus) తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 25 వరకు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ఉండగా.. ఒక్కో బస్సుకి రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే డీజిల్ డబుల్ డెక్కర్ బస్సు ధర కేవలం రూ.30 లక్షల నుండి 35 లక్షలు వరకు ఉంటుంది. కనీసం రెండు ఐకానిక్ రెడ్ డబుల్ డెక్కర్ బస్సులను అయినా ముంబయి వారసత్వంగా భద్రపరచాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde), పర్యాటక శాఖ మంత్రి మరియు ముంబయి బృహన్ ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్ పోర్ట్ ఉన్నతాధికారులను ప్రయాణికుల సంఘం విజ్ఞప్తి చేసింది.
Hello, Mumbai Police? I’d like to report the theft of one of my most important childhood memories. 😞 https://t.co/Lo9QHJBVDW
— anand mahindra (@anandmahindra) September 15, 2023
ఈ బస్సులు నిలిపివేయడంపై వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. హలో ముంబై పోలీస్? నా చిన్ననాటి జ్ఞాపకాలుగా ఉన్న ఒక దాని దొంగతనం గురించి మీకు ఫిర్యాదు చేయాలనుకుటున్నా"దాని దొంగతనం గురించి నేను నివేదించాలనుకుంటున్నాను’ అంటూ ట్విట్టర్ పోస్టులో తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: ఇంటి పై కప్పు కూలి ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి..వారిలో చిన్నారులు!