India-Canada Row: ఇకనుంచి కలిసి పనిచేద్దాం.. కెనడా రాయబారి సంచలన వ్యాఖ్యలు..

భారత్, కెనడల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు మాత్రం ఏకరీతిలో ఉన్నాయని భారత్‌లోని కెనడా హెకమిషనర్ కెమెరూన్ మెక్‌కే అన్నారు. ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాలపై దౌత్యవివాదం ఎలాంటి ప్రభావం చూపలేదని పేర్కొన్నారు.

New Update
India-Canada Row: ఇకనుంచి కలిసి పనిచేద్దాం.. కెనడా రాయబారి సంచలన వ్యాఖ్యలు..

ఇటీవల భారత్, కెనడాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఖలీస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్య కేసులో ఇండియా ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టీన్ ట్రూడో ఆరోపించడం సంచలనం రేపింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రభావితమయ్యాయి. అయితే ఈ అంశంపై తాజాగా భారత్‌లోని కెనడా హెకమిషనర్ కెమెరూన్ మెక్‌కే కీలక వ్యాఖ్యలు చేసారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నప్పటికీ కూడా దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు మాత్రం ఏకరీతిలో ఉన్నాయంటూ తెలిపారు.

Also read: మోదీ వల్లే యుద్ధం ఆగిందట.. రాజ్‌నాథ్‌సింగ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్!

దౌత్యవివాదం ప్రభావం చూపలేదు

‘వైబ్రంట్‌ గుజరాత్‌ అంతర్జాతీయ సదస్సు'లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్, కెనడాల మధ్య వ్యాపార సంబంధాలపై దౌత్యవివాదం ఎలాంటి ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులున్న విషయం రహస్యమేమి కాదని అన్నారు. అయినప్పటికీ పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలు కొనసాగించేలా రెండు వైపుల నుంచి వ్యాపార వర్గాల నుంచి ఎంతో ప్రోత్సహం వచ్చినట్లు చెప్పారు.

కలిసి పనిచేద్దాం

ఇరు దేశాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు, సాంకేతికంగా భాగస్వామ్యం అయ్యేందుకు, అలాగే అభివృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. కెనడా, భారత ప్రభుత్వాలకు , వ్యాపార వర్గాలకు సలహా ఇస్తున్నానని.. ప్రభుత్వాలు చేస్తున్న పనులు చేయనివ్వండని సూచనలు చేశారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధం కొనసాగించండి అంటూ కోరారు. వ్యాపార సంబంధాలను కూడా ఎప్పట్లాగే నిర్వహిద్దామని.. మన వ్యాపారాలను, దేశాలను మళ్లీ స్నేహపూర్వకంగా మార్చడానికి కలసి పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు కెమెరూన్‌ మెక్‌కే.

Also Read: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హార్వర్డ్ అధ్యాపక బృందం.. ఎందుకో తెలుసా?

Advertisment
తాజా కథనాలు