జుట్టు(Hair) రక్షణకు తలస్నానం చేయడం అన్నిటికంటే ముఖ్యం. మన జుట్టును క్లీన్ చేసేది తలస్నానం మాత్రమే. అయితే తలస్నానం చేసేటప్పుడు జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. దీనికి చెక్ పెట్టేందుకు నిపుణులు ఒక చిట్కా చెబుతున్నారు. తలస్నానం చేసే ముందు నూనెతో మసాజ్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందట. ఆవనూనె(Mustard Oil)ను జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నూనె తలకు పోషణను అందిస్తుంది అంతేకాదు రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. దీంతో పాటుగా ఈ నూనెలో జుట్టును హైడ్రేట్‌గా ఉంచే అణువులు ఉంటాయి.. అవి జుట్టుకు తగిన పోషణను అందిస్తాయి. ఆవనూనెను జుట్టుకు వివిధ రకాలుగా అప్లై చేయవచ్చు. ఈ రెమెడీ చేయడానికి ఉత్తమ మార్గం షాంపూ చేయడానికి 10 నిమిషాల ముందు ఆవ నూనెను జుట్టుకు అప్లై చేసి తేలికగా మసాజ్ చేసి, తరువాత జుట్టును కడగాలి. ఈ రెమెడీని 4 వారాల పాటిస్తే మీరు జుట్టులో మార్పును చూస్తారు.
ఆవ నూనెను అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఆవనూనె జుట్టు పెరుగుదలకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో 60 శాతం కొవ్వు ఆమ్లాలు, ఒమేగా -2, ఒమేగా -6 ఉన్నాయి. ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది. జుట్టును బలోపేతం చేస్తుంది. జుట్టు నిర్జలీకరణానికి గురవుతుంది, విచ్ఛిన్నతను కూడా తగ్గిస్తుంది. ఆవనూనెలోని యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం జుట్టు పెరుగుదలకు చాలా అవసరం.
ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు ఒత్తుగా మారుతుంది. దీని గ్లూకోసినోలేట్లలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
జుట్టు రాలడానికి ప్రధాన కారణం జుట్టులో పేరుకుపోయిన మురికి. ఈ మురినిని రిమూవ్ చేయడానికి ఆవనూనే తలకు పట్టిన తర్వాత తలస్నానం చేస్తే మంచిది.
వెంట్రుకలు విరిగిపోతే జుట్టును క్రమం తప్పకుండా కత్తిరించుకోవాలి. జుట్టు చాలా క్లిష్టంగా మారుతున్నట్లయితే.. హెయిర్ కట్ చేయండి.
Also Read: ఆఫీసులో పొరపాటున ఇలా చేయకండి.. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు!
WATCH: