Asaduddin Owaisi : కండోమ్స్ ఎక్కువగా వాడేది ముస్లింలే.. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తున్నారని మోడీ అంటున్నారని అన్నారు అసదుద్దీన్ ఓవైసీ. ముస్లిం సమాజంలోని పురుషులు ఎక్కువగా కండోమ్‌లను వినియోగిస్తున్నారని, చైల్డ్ స్పేసింగ్‌లో ఎక్కువ రికార్డు కలిగి ఉన్నారని అన్నారు. మోడీ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చుస్తున్నారని ఫైరయ్యారు. By V.J Reddy 28 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Condoms : రాజస్థాన్(Rajasthan) ఎన్నికల ప్రచారం(Election Campaign) లో ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) ‘‘ఎక్కువ పిల్లలు ఉన్నవారు’’ అంటూ కామెంట్స్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలకు హైదరాబాద్(Hyderabad) ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) కౌంటర్ ఇచ్చారు. ముస్లిం సమాజంలోని పురుషులు ఎక్కువగా కండోమ్‌లను వినియోగిస్తున్నారని, చైల్డ్ స్పేసింగ్‌లో ఎక్కువ రికార్డు కలిగి ఉన్నారని అన్నారు. ‘‘ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తున్నారని మోడీ చెబుతున్నారు. నరేంద్రమోడీకి ఆరుగురు సోదరులు, అమిత్ షాకు ఆరుగురు సోదరీమణులు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కి 10-12 మంది సోదరీమణులు ఉన్నారు’’ అని ఆయన అన్నారు. ALSO READ: రిజర్వేషన్ల రద్దు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఫైర్ కేంద్ర గణాంకాల ప్రకారం ముస్లింల సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పడుతోందని చెప్పారు. కానీ మన హిందూ సోదరుల్లో భయాన్ని సృష్టించేందుకు నరేంద్రమోడీ ద్వేషాన్ని పెంచుతున్నారని ఆరోపించారు. ఈ దేశంలో ముస్లింలు ఎప్పటికీ మెజారిటీగా ఉండరని, నరేంద్రమోడీ ముస్లిం పట్ల ఈ భయాన్ని మీరు ఎంతకాలం కొనసాగిస్తారు..? అని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రశ్నించారు. ప్రధాని మోడీ 17 కోట్ల భారతీయ ముస్లింలను చొరబాటుదారులు అని పిలిచారని, దళితులు ముస్లింల పట్ల ద్వేషం మోడీ గ్యారెంటీ అని దుయ్యబట్టారు. అంతకుము ముందు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత బాణం వేసినట్లు సంజ్ఞ చేయడాన్ని ఆయన నిందించారు. ఇది మసీదుపై బాణం వేయడం కాదని, నగరంలో శాంతిని నాశనం చేయడానికి లక్ష్యంగా చేసుకున్న ప్రయత్నమని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని సంపదపునర్విభజన అనే హామీని ప్రస్తావిస్తూ ప్రధాని మిమర్శలు చేశారు. దేశంలోని ప్రజల సందపను చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచుతారా..? అని ప్రశ్నించారు. దేశంలోని వనరులపై ముస్లింలకే తొలి హక్కు అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ముస్లింలపై ప్రధాని హింసను ప్రేరేపిస్తున్నారని దుయ్యబట్టాయి. #bjp #modi #asaduddin-owaisi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి