SS Thaman : ప్రభాస్ 'రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ పై థమన్ అదిరిపోయే అప్డేట్..!

ప్రభాస్ 'ది రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. జనవరిలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అప్డేట్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

New Update
SS Thaman : ప్రభాస్ 'రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ పై థమన్ అదిరిపోయే అప్డేట్..!

Prabhas The RajaSaab: పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో 'ది రాజా సాబ్' ఒకటి. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో డార్లింగ్ ప్రభాస్ వింటేజ్ లుక్ లో రొమాంటిక్ బాయ్ గా కనిపించి ఆకట్టుకున్నారు. ఇక తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..

తమన్ సంగీతం అందించిన 'రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ జనవరిలో రిలీజ్ కానుందని తాజా సమాచారం. తమన్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అప్డేట్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా థమన్ "OG" సినిమా ఫస్ట్ సింగిల్ గురించి కూడా ఆయన కొన్ని విషయాలు చెప్పారు.

Also Read : ఆ ప్రశ్న హీరోలను ఎందుకు అడగరు? దమ్ముంటే వాళ్ళను అడగండి.. రిపోర్టర్ పై ఫైర్ అయిన టబు..!

'ది రాజా సాబ్' సినిమాలో ప్రభాస్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని దర్శకుడు మారుతి ఇప్పటికే తెలిపారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో సాగనుంది. 2025 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
తాజా కథనాలు