సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాత, స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అంజిరెడ్డిని రవి కాట్రగడ్డ చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లుపోలీసులు గుర్తించారు. ఈ ఘటన గత నెల 29న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిదింతుడు రవి కాట్రగడ్డను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంజిరెడ్డి ఆస్తుల కోసమే హత్య జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సికింద్రాబాద్‌లోని గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి దారుణ హత్య కేసులో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. అంజిరెడ్డిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడునిందితుడు. అంజిరెడ్డి ఆస్తిని కాజేసేందుకే పక్కా ప్రణాళిక ప్రకారం కుట్ర చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బిహారీ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి రావి అనే వ్యక్తి ఈ హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
This browser does not support the video element.
ఆస్తులను అమ్మి అమెరికాకు
గత నెల (సెప్టెంబర్) 29న గోపాలపురం పీఎస్ పరిధిలోని వాణిజ్య సముదాయంలోని సెల్లార్‌లో అంజిరెడ్డిని హత్య చేశారు. అయితే.. తన ఆస్తులను అమ్మి అమెరికాకు వెళ్లాలనే ఆలోచనలో స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి ఉన్నాడు. ఈ నేపథ్యంలో రవి అనే వ్యక్తి రూ.3 కోట్ల విలువైన ఆయన భవనాన్ని కొనుగోలు చేసేందుకు రూ.5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. అయితే ఎలాగైనా అంజిరెడ్డి భవనాన్ని మిగతా సొమ్ము చెల్లించకుండా తన సొంతం చేసుకునేందుకు ఆయన హత్యకు కుట్ర పన్నాడు రవి.
కీలక విషయాలు
నిర్మాత, స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డిని చంపడానికి గల కారణాలను అన్ని కోణాలలో విచారిస్తున్నారు గోపాలపురం పోలీసులు. నిర్మాత ఆస్తుల కోసమేనా..? ఇంకా ఏమైనా గొడవలు ఉన్నాయా..? అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఆస్తులు అన్నింటిని తన పేరు మీద రాయించుకొని నిర్మాతను హత్య చేసిన రవిని కఠినంగా శిక్షించాలని కుటుబం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అంజిరెడ్డిని హత్యలో పాల్గొన్న ఇద్దరు బీహారీలతో పాటు కాట్రగడ్డ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.