Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదైంది. రిజర్వేషన్ వివాదంతో చెలరేగిన అల్లర్లలో వందలమంది మరణించగా.. మొహమ్మద్‌పుర్‌లోని ఓ కిరాణ దుకాణ యజమాని అబుసయ్యద్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే అబుసయ్యద్ మరణానికి షేక్ హసీనానే కారణమంటూ సయ్యద్ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆమెపై బంగ్లాదేశ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ కేసులో ఆమెతోపాటు మరో ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నిందితుల్లో అవామీ లీగ్ పార్టీ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ క్వాడర్, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఐజీ అబ్దుల్లా అల్ మామున్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Neeraj-M bhaker: నీరజ్-మను ప్రేమయాణం? అందరిముందే ఒట్టు వేయించుకున్న మను తల్లి: వీడియో వైరల్!
ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టగా వారి నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో అవామీ లీగ్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోగా షేక్‌హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. సైన్యం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగా.. నోబెల్ గ్రహీత, బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు.