Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదైంది. రిజర్వేషన్ వివాదంతో చెలరేగిన అల్లర్లలో వందలమంది మరణించగా.. మొహమ్మద్‌పుర్‌లోని ఓ కిరాణ దుకాణ యజమాని అబుసయ్యద్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే అబుసయ్యద్ మరణానికి షేక్ హసీనానే కారణమంటూ సయ్యద్ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆమెపై బంగ్లాదేశ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ కేసులో ఆమెతోపాటు మరో ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నిందితుల్లో అవామీ లీగ్ పార్టీ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ క్వాడర్, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఐజీ అబ్దుల్లా అల్ మామున్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై హత్య కేసు.. ఆ మరణాలకు కారణమయ్యారంటూ!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదైంది. ఓ కిరాణ షాపు యజమాని అబుసయ్యద్ మరణానికి హసీనానే కారణమంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో హసీనాతోపాటు మరో 6గురిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు కథనాలు వెలువడ్డాయి.
Translate this News: