మోదీ, యోగిని చంపేస్తామంటూ బెదిరింపు కాల్..వ్యక్తి అరెస్ట్! ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ లను చంపేస్తామని ఓ గుర్తు తెలియని వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితున్ని గుర్తించి అరెస్ట్ చేశారు. By Bhavana 21 Nov 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లను చంపుతానంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. ఫోన్ సిగ్నల్స్ ద్వారా అతడిని ట్రేస్ చేసిన పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోనికి తీసుకోగా..నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లను చంపుతామని బెదిరించమని తనకి దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ చెప్పినట్లు తెలిపాడు. అంతే కాకుండా ముంబై జేజే హాస్పిటల్ కి కూడా బాంబ్ బెదిరింపు కాల్ చేయమని చెప్పినట్లు కూడా వెల్లడించారు. నిందితుడ్ని అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేసి ఐపీసీ 505(2) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే అక్టోబర్ నెలలో కూడా ముంబై పోలీసులకు ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ లో భారత ప్రభుత్వం రూ.500 కోట్లు చెల్లించకపోయినా, గ్యాంగస్టర్ లారెన్స్ బిష్ణోయ్ ని విడుదల చేయకపోతే మోదీ స్టేడియాన్ని పేల్చివేస్తామంటూ ఓ వ్యక్తి మెయిల్ పంపాడు. ఇప్పటికే భారత్ లో ఉగ్రవాదుల గ్యాంగ్ భారత్ లో అడుగుపెట్టిందని ముంబైలో పలు ప్రాంతాలను పేల్చడానికి ప్రణాళికలు రూపొందించినట్లు బెదిరించాడు. నిందితుడ్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రణాళికలు సిద్దం చేసుకుని పట్టుకోగా అతడు గోర్‌గావ్ చెందిన నాగేంద్ర శుక్లాగా పోలీసులు గుర్తించారు. ఇది ఓ ఫ్రాంక్ మెయిల్ అని, మద్యం మత్తులో అతడు ఈ బెదిరింపుల కాల్స్ మెయిల్స్ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. Also read: పార్లమెంట్ లో బాంబు పేల్చిన ప్రతిపక్షం…ఎక్కడంటే! #modi #phone #yogi #threat #mumabi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి