Salman khan : కాల్పుల కేసులో మరో నిందితుడు అరెస్ట్

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల కేసులో ముంబాయి పోలీసులు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇతను ఐదవ వాడు. మహ్మద్ రఫీక్‌ చౌదరి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ముంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.

New Update
Salman khan : కాల్పుల కేసులో మరో నిందితుడు అరెస్ట్

Mumbai Police :బాలీవుడ్(Bollywood) కండల వీరుడు సల్మాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన కేసులో పోలీసులు ఇంకా అరెస్ట్‌లు చేస్తూనే ఉన్నారు.ఇంతకు ముందు నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈరోజు మహ్మద్ రఫీక్ చౌదరి అనే మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడు సల్మాన్ ఖాన్ ఇంటి వీడియోను చిత్రీకరించినట్లుగా గుర్తించారు. రఫీక్ వీడియో తీసి గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్‌కు పంపిస్తే...దాని ఆధారంగా షూటర్లు కాల్పులుకు పాల్పడ్డారని ముంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ముంబాయి పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. అది కాకుండా భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే. ఈ కాల్పుల ఘటన కేసులో నిందుతుల్లో ఒకరైనా అనుజ్ థాఫన్(32) పోలీసుల కస్టడీలో ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్యయత్నానికి యత్నించగా.. పోలీసులు గుర్తించి వెంటనే సమీపంలోని ఆస్పత్రిలోకి చేర్చారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంట్లో కాల్పులు జరిగిన కేసులో షూటర్లకు ఆయుధాలు అందించినట్లు అనూజ్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతడి కస్టడికి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే సమయంలో అనూజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21) తో పాటు వారికి ఆయుధాలు అందించాడనే ఆరోపణతో అనుజ్ థాపన్ (32) అనే నిందితుడిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు(Mumbai Crime Branch Police) అరెస్ట్ చేశారు. ఇప్పుడు మహ్మద్ రఫీక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతనితో కలిపి మొత్తం ఐదుగురిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు పోలీసులు.

ఏప్రిల్‌ 14న సల్మాన్‌ ఇంటిపై కాల్పులు జరిగాయి. ఆయన నివాసం ఉంటున్న ముంబైలోని బాంద్రా ప్రాంతంలో గల గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ దగ్గరకు మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. దాని తరువాత సల్మాన్‌ ఇంటి దగ్గర కాల్పులకు పాల్పడింది తామేనంటూ లారెన్స్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ సోషల్‌ మీడియా(Social Media) లో ప్రకటించాడు. సల్మాన్‌ ఖాన్‌పై బిష్ణోయ్‌ గ్యాంగ్‌ గతంలోనూ పలుమార్లు బెదిరింపులకు పాల్పడింది. దీంతో అప్పటి నుంచి సల్మాన్‌కు వై ప్లస్‌ భద్రత కల్పిస్తున్నారు.

Also Read:Hyderabad: తమ్ముడూ మాకు 15సెకన్లు చాలు..ఎంఐఎంపై బీజేపీ అభ్యర్ధి నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు