Mumbai Indians: ముచ్చటగా మూడో'సారీ'..

ఏంటో పాపం ముంబై ఇండియన్స్‌కు ఈసారి ఐపీఎల్ అస్సలు కలిసి రావడం లేదు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు అయిన ముంబై టీమ్...అన్నింటిలోనూ పరాజయం మూటగట్టుకుంది. నిన్నటి మ్యాచ్‌లో అయితే రాజస్థాన్ రాయల్స్ చేతిలో మరీ చెత్తగా ఓడిపోయింది.

New Update
Mumbai Indians: ముచ్చటగా మూడో'సారీ'..

IPL 2024 MI vs RR: ఈసారి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆటతీరు చాలా ఘోరంగా ఉంది. అసలే మొదటి నుంచి వివాదాలతో సతమతమవుతున్న టీమ్‌ను ఇప్పుడు ఓటములు కూడా సతాయిస్తున్నాయి. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లూ ఓడిపోయింది ముంబై ఇండియన్స్ (Mumbai Indians). అసలు ఆడలేక చేతులెత్తేసే పరిస్థితిలో ఉంది. జట్టు ఆటతీరు ఇలాగే కొనసాగితే నాకౌట్‌కు కూడా వెళ్ళే ఛాన్స్ ఉండదు. నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మరీ పూర్ పెర్ఫామెన్స్ చేసింది. స్టార్ ఆటగాళ్ళు ఉన్నా..లాభం లేకపోయింది.

ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్‌, ముంబై ఇండియన్స్ మూడేసి మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో రాజస్థాన్ మూడు మ్యాచ్‌లలోనూ గెలిస్తే...ముంబై ఇండియన్స్ మూడింటిలోనూ ఓటిపోయింది. హోంగ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ విజయం దక్కించుకోలేకపోయింది ముంబై. టీమ్ బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. ముంబై మొదట బ్యాటింగ్ చేసింది. మొదటి 21 బంతుల్లోనే నాలుగు వికెట్లు కోల్పోయారు. రోహిత్ శర్మతో (Rohit Sharma)  సహా నలుగురు డకౌట్లుగా వెనుదిరిగారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ బౌల్ట్ ముంబై బ్యాటర్లను చిత్తు చిత్తు చేసేశాడు. నాలుగు వికెట్లు కోల్పోయాక ముంబై ఇండియన్స్ కొంత కోలుకున్నా...125 పరుగులు కన్నా ఎక్కువ చేయలేకపోయారు. హార్దిక్‌ పాండ్యా (21 బంతుల్లో 34; 6 ఫోర్లు), తిలక్‌ వర్మ (29 బంతుల్లో 32; 2 సిక్స్‌లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు.

అయితే అతర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ కూడా మొదట్లో తడబడింది. లక్ష్యం చిన్నదే అయినా కాస్త కంగారుపడినట్టు కనిపించింది. తొలి ఓవర్లోనే యశస్వి (10) వెనుదిరగ్గా... సంజూ సామ్సన్‌ (12), బట్లర్‌ (13) కూడా విఫలమయ్యారు. కానీ రియాన్ పరాగ్ జట్టును ఆదుకున్నాడు. జాగ్రత్తగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. అశ్విన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 40 పరుగులు చేశాడు. ఇంకా మ్యాచ్ గెలవడానికి 14 పరుగులు అవసరం ఉండగా వరుసగా రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాది ముగించాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు పరాగ్. కానీ ముంబై ఇండియన్స్‌ను కోలుకోలేని దెబ్బ తీసిన బౌల్ట్‌కు మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. విజయంలో కీలకపాత్ర పోషించిన బౌల్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.

ఇక సొంత గ్రౌండ్‌లో హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. ముంబై ఫ్యాన్స్ నుంచి అతనికి తీవ్ర నిరశన ఎదురైంది. అసలే రోమిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించిన కోపంలో ఉ్న ఉన్న అభిమానులు మొదటి రెండు మ్యాచ్‌లూ ఓడిపోవడంతో మరింత రెచ్చిపోయారు. పాండ్యా పేరు వినిపించినప్పుడల్లా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. టాస్‌కు వచ్చినప్పుడు మాట్లాడకుండా డిస్టర్బ్ చేశారు. కామెంటేటర్లు మర్యాద పాటించండి అంటూ రిక్వెస్ట్ చేసినా వినలేదు.

Also Read:Supreme Court: వీవీ ప్యాట్ల లెక్కింపుపై ఈసీకి సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు