Hardik Pandya Trolled: హార్దిక్‌పాండ్యా సోషల్‌మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్నాడు. నిజానికి ట్రోల్ అన్నది అసలు మంచి పద్ధతి కాదు. హార్దిక్‌ను హార్పిక్ అని.. చాప్రి అని పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇలా పర్శనల్‌గా హార్దిక్‌పై ట్రోల్స్ చేయడం క్రికెట్ ప్రతిష్టపై ప్రతీకూల ప్రభావాన్ని చూపుతుంది. విమర్శలకు హద్దు ఉండాలి. నిజానికి హార్దిక్ పాండ్యా చేసిన తప్పిదాలు అనేకం కనిపిస్తున్నాయి. ముంబైకు కెప్టెన్‌గా (Mumbai Indians Captain) మారిన తర్వాత ఇప్పటివరకు ఆ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ పాండ్యా కెప్టెన్‌గా ఫెయిల్ అయ్యాడు. గుజరాత్‌పై మ్యాచ్‌లో పాండ్యా తొలి ఓవర్ వెయ్యడం అనేక విమర్శలకు దారి తీసింది. కోయిట్జి, బుమ్రా లాంటి బౌలర్లు ఉండగా.. పాండ్యా తనకు తానుగా బౌలింగ్ చేయడం ముంబై కొంపముంచింది. ఎందుకంటే ఇది గుజరాత్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చింది.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా:
అదే మ్యాచ్‌లో వికెట్లు వరుస పెట్టి వికెట్లు పడుతున్నా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కు రాలేదు. అతని కంటే ముందుగా టిమ్ డేవిడ్‌ను బ్యాటింగ్‌కు దింపాడు. రషీద్ ఖాన్ కోటా ముగిసే వరకు పాండ్యా బ్యాటింగ్‌కు దికకపోవడం పలు విమర్శలకు తావిచ్చింది. ఇదే పాండ్యా.. నిన్నటి హైదరాబాద్ మ్యాచ్‌లో (SRH Vs MI) టిమ్ డేవిడ్ కంటే ముందుగా బ్యాటింగ్‌కు దిగాడు. రావడంతోనే రెండు సిక్సర్లతో అలరించినా తర్వాత పూర్తిగా డిఫెన్స్‌లో బ్యాటింగ్ చేశాడు. ఇది ముంబై ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. అందరూ 200కు పైగా స్ట్రాక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తుంగా.. పాండ్యా కేవలం 120 స్ట్రైక్‌రేట్‌తోనే బ్యాటింగ్ చేశాడు.
ఇంత నిర్లక్ష్యమా?
20 ఓవర్లలో 278 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయడంలో పాండ్యా (Hardik Pandya) ఆడిన తీరు, అతని బాడీ లాంగ్వేజ్ ఏ మాత్రం గెలవలన్నా ఇంటెంట్‌తో లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అతను ఔటైన తీరు కూడా చాలా నిర్లక్ష్యంగా కనిపించింది. ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. అయితే ఛేదనలో ముంబై ధీటుగా బదులిచ్చింది. గతంలో 15 ఓవర్లలోనే 190కు పైగా టార్గెట్‌ను ఛేజ్ చేసిన రికార్డు ముంబైకు ఉంది. ఛాలెంజ్‌లను ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకోని అసాధ్యాలను సుసాధ్యం చేసిన మ్యాచ్‌లు ముంబై ఖాతాలో చాలా ఉన్నాయి. అయితే పాండ్యా ఆట తీరు ముంబైకు సరిపోనట్టు ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అటు బౌలింగ్‌లో చివరి ఓవర్ ఓ సాధారణ స్పిన్నర్‌కు ఇవ్వడం అతని కెప్టెన్సీ స్కిల్స్‌ను క్వశ్చన్ చేసేలా ఉంది.
Also Read: దంచికొట్టుడుపై స్పందించిన అభిషేక్!