mukesh ambani kids: వాళ్ళకు అసలు జీతాలే ఉండవట...లాభాల మీద కమీషన్ మాత్రమే ఇస్తారుట. ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీవారసులైన ఆకాశ్ అంబానీ. ఇషా అంబానీ , అనంత్ అంబానీలకు అసలు జీతాలే ఉండవట. ఇటీవలే రిలయన్స్ బోర్డులోకి అడుగుపెట్టిన వీరు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నా కూడా వేతనాలు మాత్రం నిల్ అని చెబుతున్నారు. బోర్డు సమావేశాలకు హాజరైనప్పుడు మాత్రం సంస్థ చెల్లించే ఫీజులు మాత్రమే వీరికి చెల్లిస్తారని అంటున్నారు. By Manogna alamuru 27 Sep 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ముఖేష్ అంబానీ తర్వాతి తరం వారి వ్యాపారాల్లోకి అడుగుపెట్టింది. పిల్లలు ముగ్గురూ రిలయన్స్ ఇండస్ట్రీలోని ఒకకో కంపెనీను చూసుకుంటూ తమ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళుతున్నారు. అయితే ఈ పని చేస్తున్నందుకు వీరికి కంపెనీ నుంచి జీతం మాత్రం రాదని చెబుతున్నారు. కేవలం బోర్డు సమావేశాలకు మాజరైనప్పుడు మాత్రమే సంస్థ ఫీజులు చెల్లిస్తుందట. అలాగే సంస్థ లాభాలపై కమీషన్‌నూ తీసుకుంటారట.ఈ విషయాన్ని షేర్ హోల్డర్లకు పంపిన రిజల్యూషన్‌లో కంపెనీ వెల్లడించింది. 2014లో కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా నియమితులైన ముకేశ్ భార్య నీతా అంబానీ కూడా ఇలాగే జీతం తీసుకోకుండా లాభాల మీద కమీషన్ మాత్రమే తీసుకునేవారుట. ఇప్పుడు పిల్లలు కూడా తల్లి బాటలోనే నడుస్తున్నారు. ఈ మేరకు ముకేశ్ సంతానమైన ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీలను ఆర్‌ఐఎల్ బోర్డ్ డైరెక్టర్లుగా నియమించడానికి వాటాదారుల అనుమతిని కోరుతూ ఇచ్చిన తీర్మానంలో ఆ సంస్థ పేర్కొన్నది. ఇప్పటికే 2020-21 నుంచి ముకేశ్ అంబానీ జీతం తీసుకోకుండా పనిచేస్తున్నారు. అంతకుముందు మాత్రం 2008-09 నుంచి 2019-20 వరకు ఏటా రూ.15 కోట్లు తీసుకుంటూ వచ్చారు. ఆర్‌ఐఎల్ గ్రూప్‌లోని అన్ని వ్యాపారాలు పూర్తిస్థాయిలో లాభాలను సంతరించుకునేదాకా ఇంతేనని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ముకేశ్ పిల్లలూ జీతాలు తీసుకోబోవడం లేదు.అయితే రిలయన్స్ ఇండస్ట్రీ చాలా పెద్దది. వారి వ్యాపారాలుకూడా మిలియన్ కోట్లలో నడుస్తాయి. లాబాలూ అలాగే వస్తాయి. దాన్ని బట్టి లాబాల మీద వచ్చే కమీషన్ కూడా కోట్లలోనే ఉంటుంది. రిలయన్స్ కంపెనీ రీసెంట్ గా ముకేశ్ అంబానీని మరో 5 ఏళ్ళపాటు కంపెనీ ఛైర్మన్, సీఈఓగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయన ముగ్గురు పిల్లలను బోర్డ్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించింది. అయితే తాజాగా ఈ నియామకానికి సంబంధించి షేర్ హోల్డర్ల ఆమోదం కోసం పోస్టల్ బ్యాలెట్లను పంపించింది. ఇక ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఈ మధ్యనే కంపెనీ బోర్డ్ నుంచి తప్పుకున్నారు. కానీ ఆమె కంపెనీ బోర్డ్ మీటింగ్ లకు మాత్రం శాశ్వత ఆహ్వానితురాలిగా ఉంటారు. ఈ ప్రత్యేకమైన వెసులుబాటు ముకేశ్ అంబానీ సహా కంపెనీలోని మరెవ్వరికీ లేదు. #mukesh-amabani #reliance #salary #kids #company #post #board #neeta-amabani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి