Mudragada Padmanabham : వైసీపీ లోకి కాపునేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) చేరిక వాయిదా పడింది. ఈ నెల 14న వైసీపీలోకి చేరుతారని ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15 లేదా 16 తేదీల్లో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన అభిమానులకు ఓ లేఖ రాశారు. తాడేపల్లికి వెళ్లేందుకు ఆయన ప్లాన్ చేసుకున్న ర్యాలీని రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. కేవలం తాను మాత్రమే తాడేపల్లి వెళ్ళి సీఎం జగన్(CM Jagan) సమక్షంలో పార్టీలో చేరతారని వెల్లడించారు.
Also Read : నిడదవోలులో టీడీపీ వర్సెస్ జనసేన రాజకీయం..!
ఊహించిన దానికన్నా భారీస్థాయిలో స్పందన రావడం మీదట వారికి సెక్యూరిటి ఇబ్బంది ఉంటుందని పేర్కొన్నారు. ఎక్కువమంది వస్తే కూర్చోడానికి కాదు, నిలబడడానికి కూడా స్థలం సరిపోదని..వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయడం చాలా ఇబ్బందని చెప్పడం వల్ల ర్యాలీని రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. తన అభిమానులకు నిరుత్సాహపర్చినందుకు క్షమాపణ కోరారు. మీ అందరి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
Also Read : ముందు మీది మీరు చూసుకోండి.. విదేశీయులకు ఇచ్చిపడేసిన ఇండియా!
ఇదిలా ఉండగా.. ఏపీ రాజకీయాల్లో(AP Politics) ముద్రగడ ఎపిసోడ్ కాక రేపుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముందుగా జనసేన(Janasena) లో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గతంలో జనసేన నేతలను ఆయన్ను స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడ సైతం ఆ సమయంలో జనసేన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించినట్టు వార్తలొచ్చాయి. అటు వైసీపీ(YCP) నేతలను మాత్రం కలవడానికి కూడా ముద్రగడకు ఏ మాత్రం ఇష్టం లేదని ప్రచారం జరిగింది. అయితే రాజకీయాలు ఒక రోజు ఉన్నట్టు మరో రోజు ఉండవు. అందుకే పరిణామాలన్ని వేగంగా మారిపోతున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు టీడీపీ కేవలం 24 ఎమ్మెల్యే సీట్లే కేటాయించడం పట్ల అసంతృప్తిగా ఉన్న ముద్రగడ వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.